టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం `లైగర్` ప్రమోషన్స్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రను పోషించారు. ప్రపంచంలో బ్రూస్ లీ తర్వాత అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి మైక్ టైసన్. అలాంటి లెజెండ్ `లైగర్` నటించడంతో.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం.. ఆగస్టు 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ అన్ని భాషల్లోనూ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అలాగే షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని అనుభవాలను సైతం పంచుకున్నారు.
సినిమా షూటింగ్ లో భాగంగా మైక్ టైసన్ చెంపపై కొట్టారు. ఆయన కొట్టిన దెబ్బకు ఒక రోజంతా నొప్పితో బాధపడ్డానని విజయ్ దేవరకొండ తెలిపారు. అలాగే బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ తో నటించడానికి ముందు కొంత ఆందోళన చెందానని కూడా ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా ఆయన తమ సినిమాలో నటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లు విజయ్ తెలిపారు. దీంతో ఇప్పుడీయన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!