టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రీసెంట్గా స్టార్ కిడ్ అనన్య పాండేతో కలిసి బాలీవుడ్ పాపులర్ షో `కాఫీ విత్ కరణ్` సీజన్ 7లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎంతో ఇంట్రస్టింగ్‌గా సాగే ఈ షోలో సెలబ్రెటీల టాప్ సీక్రెట్స్‌ను బయటకు లాగడంలో కరణ్ మహా దిట్ట.
ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ పూర్తవగా.. నాలుగో ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే సందడి చేశారు. ఈ ఎపిసోడ్ జూలై 28 సాయంత్రం 7 గంటల నుంచి ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఈ షోలో విజయ్ శృంగారంపై బోల్డ్ కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అయింది.
అయితే ఆయన పెళ్లిపై సైతం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. `నేను పెళ్లి చేసుకునేటప్పుడు, తండ్రి అయ్యేటప్పుడు అందరికీ చెబుతా. గట్టిగా అరిచి మరీ చెబుతా. అప్పటి వరకూ నన్ను ఆరాధించే ప్రేక్షకుల మనోభావాలు గాయపరచాలని అనుకోవడం లేదు. నటుడిగా నన్ను చాలా మంది అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు.
నా ఫోటో వాళ్ళ గోడలపై ఉంటుంది. ఫోన్ వాల్ పేపర్స్ లో ఉంటుంది. వాళ్ళ హార్ట్ ఇప్పట్లో బ్రేక్ చేయాలని అనుకోవడం లేదు` అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. మొత్తానికి పెళ్లి చేసుకుంటాను కానీ, ఇప్పట్లో కాదని పరోక్షంగా చెప్పి విజయ్ ట్విస్ట్ ఇచ్చాడు. కాగా, విజయ్ త్వరలోనే `లైగర్`తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!