Entertainment News సినిమా

ఈ స్టార్ క్రికెటర్ బయోపిక్ పై క‌న్నేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. కోరిక తీరేనా?

vijay devarakonda want to do kohli biopic
Share

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. బ్యాకింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద బొక్కబోర్లా ప‌డింది.

దీంతో ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జెంట్ హిట్ కోసం తెగ ఆరాట‌ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన‌ మ్యాచ్ కు ప్రత్యేక అతిథిగా విజ‌య్ దేవ‌ర‌కొండ హాజ‌రు అయిన సంగ‌తి తెలిసిందే. మ్యాచ్ ప్రారంభానికి ముందు కామెంటర్స్‌ మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్ పఠాన్, వసీం అక్రమ్‌తో మాట్లాడిన విజ‌య్‌.. క్రికెట్ లో తనకున్న అనుభవాలను పంచుకున్నాడు.

అలాగే ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులోఉన్న ఓ కోరికను కూడా బ‌య‌ట పెట్టేశారు. అస‌లింత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఒక‌వేళ అవకాశం వస్తే ఏ క్రికెటర్ బయోపిక్‌లో నటించాలనుంది అంటూ కామెంటర్స్ విజ‌య్ ను ప్ర‌శ్నించాడు. అందుకు ఆయ‌న బ‌దులిస్తూ.. `ధోని భాయ్‌ బయోపిక్‌ చేయాలని ఉండే. కానీ ఆయన బయోపిక్‌ను సుశాంత్‌ సింగ్‌ చేశాడు.

ధోనీ కాకుండా కోహ్లి అన్న బయోపిక్‌లో నటించాలనుంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. కోహ్లీ పాత్రకు నేను అయితే కరెక్ట్‌ సూట్ గా అవుతాన‌ని అనిపిస్తోంది` అంటూ చెప్పుకొచ్చాడు. మ‌రి కోహ్లీ బ‌యోపిక్ పై క‌న్నేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. త‌న కోరిక‌ను తీర్చుకుంటాడో..లేదో..చూడాలి. కాగా, ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ `ఖుషి`, `జ‌న‌గ‌ణ‌మ‌న‌` చిత్రాలు చేస్తున్నాడు. ఇవి రెండు పాన్ ఇండియా చిత్రాలే కావ‌డం విశేషం.

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండను స‌మంత‌నే కాపాడాలా?

“లైగర్” కోసం “అర్జున్ రెడ్డి” సెంటిమెంట్ నమ్ముకున్న విజయ్ దేవరకొండ..!!

 


Share

Related posts

Vijay Devarakonda: ఒకే జోనర్ కథలతో రిస్క్ చేస్తున్నాడా..?

GRK

కంట్రోల్ చేసుకోండంటూ క్లాస్ పీకిన రేణు దేశాయ్!

Teja

ఉప్పెన కోసం ఒక పెద్ద OTT ఆఫర్ చేసిన అమౌంట్ చూస్తే వామ్మో అంటారు .. కానీ వద్దు అన్నారు నిర్మాతలు !

siddhu