టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం `లైగర్`. ఇందులో అనన్య పాండే హీరోయిన్గా నటించింది. మైక్ టైసన్, రమ్య కృష్ణ, విషు రెడ్డి, రోనిత్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 25న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కానీ, తొలి షో నుంచే ఈ మూవీ డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. సాధారణంగా తమ సినిమా డిజాస్టర్ అంటే హీరోలు దాదాపు వారం రోజులైనా బయటకు రావడానికి సంకోచిస్తుంటారు. అయితే విజయ్ మాత్రం అందుకు భిన్నం. `లైగర్` డిజాస్టర్ అని తెలిశాక విజయ్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
లైగర్ మూవీ రిలీజైన మరుసటి రోజే విజయ్ దేవరకొండ జిమ్ కి వెళ్లిపోయాడు. తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టేందుకు జిమ్ లో కసరత్తులు మొదలు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. `లైగర్` కోసం విజయ్ దేవరకొండ దాదాపు ఏడాదిన్నర కష్టపడ్డాడు.
పైగా ఆయన కెరీర్ లో ఇది తొలి పాన్ ఇండియా చిత్రం. అలాంటి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందంటే.. ఏ హీరోకైనా నిరాశ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. కానీ, విజయ్ దేవరకొండ చాలా అంటే చాలా త్వరగా `లైగర్` రిజల్ట్ నుంచి మూవ్ ఆన్ అయిపోయాడు. బ్యాక్ టు యాక్షన్ ఎగైన్ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా, విజయ్ దేవరకొండ చేతిలో ప్రస్తుతం `జనగణమన`, `ఖుషి` చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు ఇప్పుడు సెట్స్ మీదే ఉన్నాయి.
Just a day after #Liger’s release, #VijayDeverakonda is back in action again. @TheDeverakonda sweating it out with his fitness regime. This man never stops.🔥 pic.twitter.com/qeh902naNb
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 26, 2022