టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికలు జంటగా రెండే రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటైన `గీత గోవిందం` బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. `డియర్ కామ్రేడ్` బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ రెండిటి తర్వాత మరో సినిమా కలిసి చేయకపోయినా.. తరచూ కలవడం, పార్టీలకు, డిన్నర్స్‌కు వెళ్లడంతో రష్మిక, విజయ్‌లు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.
ప్రస్తుతం లివింగ్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోవచ్చని వార్తలు వచ్చాయి. రష్మక-విజయ్‌లు ఖండించినప్పటికీ.. రూమర్లకు మాత్రం చెక్ పడటం లేదు. అయితే తాజాగా రష్మికతో తన రిలేషన్‌పై విజయ్ దేవరకొండ గుట్టు విప్పేశాడు. రీసెంట్గా ఈయన అనన్య పాండేతో కలిసి బాలీవుడ్ పాపులర్ షో `కాఫీ విత్ కరన్`లో పాల్గొన్నారు.
రోజుకి 36 గంటలుంటే బాగుండు.. రష్మిక వింత కోరిక వెనక కారణం ఏంటీ?
ఈ సందర్భంగా కరణ్ రష్మికతో డేటింగ్ రూమర్స్‌పై విజయ్ను ఆరా తీశాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. రష్మిక నా నిజమైన డార్లింగ్. నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఆమె ఒకరు. తనంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. నా కెరీర్ ప్రారంభంలోనే రష్మికతో కలిసి రెండు సినిమాలు చేశా.
షూటింగ్లో మేం మంచి స్నేహితులమయ్యాం. మేమిద్దరం కెరీర్, జీవితంలోని అన్ని విషయాలను షేర్ చేసుకుంటాం. దాంతో మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.` అంటూ చెప్పుకొచ్చారు. అలాగే రష్మికకు, తనకు మధ్య ఎలాంటి ప్రేమ లేదని, తాము రిలేషన్ లో లేమని కూడా విజయ్ స్పష్టం చేశారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!