“లైగర్” తెలుగు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నా తల్లిదండ్రులు నా ముత్తాతలు ఎవరు తెలియకపోయినా గాని మీరు నాపై చూపిస్తున్న ప్రేమకి మాటలు రావడం లేదని అన్నారు. కనీసం గత రెండు సంవత్సరాల నుండి సినిమాలు లేవు అంతకుముందు చేసిన సినిమాలు కూడా పెద్దగా చెప్పుకొనివి కావు.
అయినా గాని నాపై నమ్మకంతో మీరు చూపిస్తున్న ప్రేమకు ఆదరిస్తున్న అభిమానానికి… కృతజ్ఞతలు అని తెలియజేశారు. కేవలం ట్రైలర్ కి ఈ రీతిగా రెస్పాండ్ కావటం రచ్చ ఏంట్రా బాబు మెంటల్ మాస్ మాదిరి ఉంది. మీ ప్రేమని మాటల్లో తెలియజేస్తా ఐ లవ్ యు. “లైగర్” నీ మీకు డెడికేట్ చేస్తున్న. సినిమాలో డాన్సులు వేయాలంటే నాకు చాలా చిరాకు. కానీ మీకోసం మీరు ఎంజాయ్ చేస్తారని…”లైగర్” లో ఎప్పుడు వెయ్యని రీతిలో స్టెప్పులు వేశాను. ఈ సినిమా కోసం బాగా వర్కౌట్ చేయడం జరిగింది.
మీరు గర్వంగా ఫీల్ అవ్వాలని చాలా కష్టపడ్డాను. ఆగస్టు 25వ రోజు ఇటువంటి సెలబ్రేషన్ ప్రతి థియేటర్ లో జరగాలి. సినిమా థియేటర్ లు నిండిపోవాలి. నేను ఆల్ రెడీ గ్యారెంటీ చేశా. ఆగస్టు 25వ తారీకు ఇండియా షేక్ అవుద్ది.. అంటూ విజయ్ దేవరకొండ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. ఉదయం 9:30 కు రిలీజ్ అయిన “లైగర్” తెలుగు ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ నీ షేక్ చేస్తోంది. వరుసపరాజయాల్లో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” పై చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. మరి “లైగర్” విజయ్ దేవరకొండ కి కం బ్యాక్ సినిమా అవుతుందో లేదో చూడాలి.