కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో `వారిసు(తెలుగులో వారసుడు)` అనే ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. శరత్ కుమార్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, ఖుష్బూ, ప్రభు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది.

అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలకు మేకర్స్ ముహూర్తం పెట్టేశారు. నవంబర్ 5న వారసుడు ఫస్ట్ సింగిల్ బయటకు రాబోతోంది. ఈ విషయాన్ని ఆఫీషియల్‌గా అనౌన్స్ చేయడమే కాదు.. ఫస్ట్ సింగిల్ ప్రోమోను సైతం బయటకు వదిలారు.
ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. `రంజితమే.. రంజితమే..` అంటూ సాగే ఈ సాంగ్ అభిమానులనే కాదు సినీ లవర్స్‌ను కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే పాటకు తగ్గట్లుగానే విజయ్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. దీంతో ఇప్పుడు ఫుల్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.