కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నుంచి రాబోతున్న తాజా చిత్రమే `కోబ్రా`. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో `కేజీఎఫ్` బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఆగస్టు 31న అంటే మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో విక్రమ్ ఓవైపు సాధారణ మ్యాథ్స్ టీజర్‌గా కనిపిస్తూనే.. మరోవైపు అదే మ్యాథ్స్‌ను ఉపయోగించి రూపాలను మారుస్తూ క్రైమ్స్ చేసే వ్యక్తిగా అలరించబోతున్నాడు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, ట్రైలర్ సినిమా భారీ అంచనాలను పెంచగా.. మేకర్స్ ప్రమోషన్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేశారు.
దీంతో ఇప్పుడు ఈ మూవీ కోసం తమిళ సినీ ప్రియులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే `కోబ్రా` ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు ‘కోబ్రా’ సినిమాకి రివ్యూ ఇచ్చారు.
`కోబ్రా చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందింది. డైరెక్షన్ టెర్రిఫిక్‌గా ఉంది. క్లైమాక్స్, ప్రొడక్షన్ డిజైన్ అద్బుతంగా ఉంది. ఈ సినిమాలో హీరో విక్రమ్ మరోసారి అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అతడి నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇర్ఫాన్ పఠాన్ కోబ్రాలో చూడటం ఆనందంగా ఉంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఖచ్చితంగా ఇష్టపడతారు` అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి ఉమైర్ సంధు కామెంట్స్ బట్టీ చూస్తుంటే.. `కోబ్రా` హిట్ అయ్యేలానే కనిపిస్తోంది.