Virata Parvam: దగ్గుబాటి రానా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి తొలిసారి జంటగా నటించిన చిత్రం `విరాట పర్వం`. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు.
ప్రియమణి, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నక్సలిజం నేపధ్యంలో రూపుదిద్దుకున్న ప్రేమ కథా చిత్రమిది. గత ఏడాదే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. అనేక వాయిదాల అనంతరం జూన్ 17న విడుదలై మంచి స్పందన దక్కించుకుంది.
అయితే టాక్ బాగానే ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం బిలో యావరేజ్‌గా ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్‌కి వరల్డ్ వైడ్ గా రూ. 3.14 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. వర్కింగ్ డేస్‌లో బాగా వీక్ అయిపోయింది. 6వ రోజు మరీ దారుణంగా రూ. 10 లక్షల షేర్ తో సరిపెట్టుకున్న ఈ చిత్రం.. వరల్డ్ వైడ్ గా సినిమా రూ. 17 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఏరియాల వారీగా విరాట పర్వం ఇప్పటి వరకు సాధించిన టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నిజాం: 1.30 కోట్లు
సీడెడ్: 0.22 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.28 కోట్లు
తూర్పు: 0.19 కోట్లు
పశ్చిమ: 0.13 కోట్లు
గుంటూరు: 0.19కోట్లు
కృష్ణ: 0.16 కోట్లు
నెల్లూరు: 0.9 కోట్లు
——————–
ఏపీ+తెలంగాణ=2.56కోట్లు(4.21 కోట్లు~ గ్రాస్)
——————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 0.31 కోట్లు
ఓవర్సీస్: 1.06 కోట్లు
——————–
వరల్డ్ వైడ్ కలెక్షన్= 3.93 కోట్లు(6.77కోట్లు~ గ్రాస్)
——————–
ప్రపంచవ్యాప్తంగా రూ. 14 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 14.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ కాకుండా వరల్డ్ వైడ్‌గా రూ. 10.57 కోట్ల షేర్‌ను రాబడితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. కానీ, ఆ పరిస్థితి కనిపించకపోవడంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న సాయి పల్లవికి.. ఈసారి ఫ్లాప్ ఖాయమనే టాక్ మొదలైంది.
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…