Virata Parvam: రూ. 14.50 కోట్ల టార్గెట్‌.. 3 రోజుల్లో `విరాట ప‌ర్వం`కు వ‌చ్చిందెంతో తెలుసా?

Share

Virata Parvam: ద‌గ్గుబాటి రానా, స‌హ‌జ న‌టి సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్ర‌మే `విరాట ప‌ర్వం`. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై సుధాకర్ చెరుకూరి, సురేశ్‌ బాబు నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ప్రియమణి, న‌వీన్ చంద్ర‌, నివేదా పేతురాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లను పోషించారు.

నక్సలిజం నేపధ్యంలో రూపుదిద్దుకున్న ఓ చ‌క్క‌టి ప్రేమ క‌థనే విరాటప‌ర్వం. అనేక వాయిదాల అనంత‌రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం.. మంచి స్పందన‌ను ద‌క్కించుకుంది. ముఖ్యంగా సాయి ప‌ల్ల‌వి న‌ట‌న అద్భుతంగా ఉందంటూ ఆమెపై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపించారు. అయితే అంతా బాగానే ఉన్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ యావ‌రేజ్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతోంది.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 90 లక్ష‌లు, రెండో రోజు 63 ల‌క్ష‌ల షేర్‌ను వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. మూడో రోజు రూ. 50 ల‌క్ష‌ల షేర్‌తో స‌రిపెట్టుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 14 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 14.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. అయితే ఈ మూడు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ. 3.14 కోట్ల షేర్‌ను మాత్ర‌మే ద‌క్కించుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే మొద‌టి మూడు రోజులు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 11.36 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సి అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇక ఏరియాల వారీగా విరాట ప‌ర్వం 3 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నిజాం: 1.11 కోట్లు
సీడెడ్: 0.17 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 0.20 కోట్లు
తూర్పు: 0.15 కోట్లు
పశ్చిమ: 0.11 కోట్లు
గుంటూరు: 0.15 కోట్లు
కృష్ణ: 0.12 కోట్లు
నెల్లూరు: 0.8 కోట్లు
——————–
ఏపీ+తెలంగాణ‌=2.09కోట్లు(3.40 కోట్లు~ గ్రాస్‌)
——————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 0.25 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 0.80 కోట్లు
——————–
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్‌= 3.14 కోట్లు(5.35కోట్లు~ గ్రాస్‌)
——————–


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

1 hour ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

2 hours ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

4 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

5 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

5 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

6 hours ago