NewsOrbit
Entertainment News సినిమా

Virata Parvam OTT Release: ప్ర‌ముఖ ఓటీటీకి `విరాట ప‌ర్వం`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Advertisements
Share

Virata Parvam OTT Release: రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి తొలిసారి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `విరాట ప‌ర్వం`. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మించారు. నందితాదాస్‌, ప్రియమణి, నవీన్‌చంద్ర త‌దిత‌రులు ఈ మూవీ ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు.

Advertisements

గ‌త ఏడాడే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. వాయిదా ప‌డుతూ ప‌డుతూ చివ‌రాఖ‌ర‌కు నిన్న గ్రాండ్‌గా విడుద‌లైంది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ అందమైన లవ్‌స్టోరీని ఆవిష్కరించడం విరాటపర్వం స్పెషల్‌. 1992లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వ‌స్తున్నాయి.

Advertisements

ముఖ్యంగా సాయి ప‌ల్ల‌వి న‌ట‌న అద్భుతం అంటూ ఆమె ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక‌పోతే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఓ క్రేజీ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. `విరాట‌ప‌ర్వం` డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింద‌ని తెలుస్తోంది.

సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో విరాట పర్వం ఓటీటీ విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంద‌ని అంటున్నారు. జూలై మూడో వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యే ఛాన్సులు ఉన్నాయంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.


Share
Advertisements

Related posts

తోబుట్టువులుగా

Siva Prasad

మాటల మాంత్రికుడి చేతుల మీదుగా వనవాసం…

Siva Prasad

Devatha Serial: ఆదిత్య కు దిమ్మతిరిగే షాక్.. దేవి ప్రశ్నలకు రాధ సమాధానం ఏంటి..!? 

bharani jella