సమంత.. సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. `ఏ మాయ చేశావే` వంటి హిట్ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ అమ్మడు.. అంచలంచలుగా ఎదుగుతూ సౌత్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని ఇంటికి కోడలు అయింది.
అయితే చైతుతో ఈమె బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే చైతుతో సామ్ విడిపోయింది. ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి సారించిన సామ్.. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్ గా ఉండే సమంత.. నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో అభిమానులను అలరించేది.
కానీ, ఏమైందో ఏమోగానీ.. గత రెండు వారాల నుండీ సోషల్ మీడియాలో సమంత సైలెంట్ అయిపోయింది. ఫోటోషూట్స్, బ్రాండ్స్ ప్రమోషన్స్, యాడ్స్, సినిమా అప్డేట్స్.. ఇలా ఏదో ఒక విధంగా తన గురించి అప్డేట్ ఇస్తూ అందరికీ టచ్‌లోనే ఉండే సమంత సడెన్‌గా నెట్టింటికి దూరమైపోయింది. సమంత చివరిగా జూన్ 30న ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.
మొన్నామధ్య సమంత ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయ్యిందని తన టీమ్ వ్యక్తి పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. ఇన్స్టాలోగానీ, ట్విటర్లోగానీ.. ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. దీంతో ఆమె అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలు సమంతకు ఏమైంది..? ఎందుకు సోషల్ మీడియాలో సైలెంట్ అయింది..? షూటింగ్స్‌లో బిజీగా ఉందా..? లేక కావాలనే ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందా..? అంటూ రకరకాల చర్చలు ప్రారంభించారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!