Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల జోడీకి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ జంటగా `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాలు చేశార. వీటిలో గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్టైతే.. డియర్ కామ్రేడ్ యావరేజ్ అనిపించుకుంది. అయితే విజయ్-రష్మికల జోడీకి మాత్రం యమా క్రేజ్ ఏర్పడింది.
ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ, తాము స్నేహితులమే విజయ్, రష్మికలు ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే కెరీర్ పరంగా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న రష్మిక.. ఇప్పటి వరకు ఒక్క ఐటెం సాంగ్ కూడా చేయలేదు. భారీ ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే అదే రష్మిక విజయ్ కోసం ఆ పని చేయబోతోందట. ప్రస్తుతం విజయ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌లో `జనగణమన` ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి, ఛార్మీ కలిసి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా అలరించబోతోంది.
ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుంది. అయితే ఆ సాంగ్ పూరీ రష్మికను సంప్రదించారట. మొదట ఒప్పుకోకపోయినా.. విజయ్ సైతం రిక్వస్ట్ చేయడంతో వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. మరి విజయ్ కోసం నిజంగా రష్మిక ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకుందా..లేదా..అన్నది త్వరలోనే తెలియనుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!