టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏపీ, తెలంగాణలో అభిమానులు భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేశారు. తాజాగా మహేష్ పుట్టినరోజు ఒక రేంజ్ లో జరిగిందని చెప్పాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున మహేష్ బాబు గత హిట్ సినిమాల స్పెషల్ షోలు వేశారు. మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఒక్కడు- పోకిరి సినిమాలను అభిమానుల కోసం ప్రత్యేకంగా వేశారు. ఒక్కడు సినిమాను చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే వేస్తే పోకిరి సినిమాను.. ఏపీ – తెలంగాణలో పలు ప్రాంతాలతో పాటు అటు ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో 400కు పైగా షోలు వేశారు.
ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలోనూ ఒక సినిమాను రీ రిలీజ్ చేసి 400 స్పెషల్ షోలు వేసిన సందర్భాలు లేవు. ఈ విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విచిత్రం ఏంటంటే హైదరాబాదులో పోకిరి స్పెషల్ షోలు అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. ఒక నైజాంలోనే పోకిరికి ఏకంగా రు. 70 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే పోకిరి చుట్టూ ఇంత హంగామా జరుగుతుంటే ఆ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉన్నారు.
పలువురు పోకిరి రీ రిలీజ్ హంగామా గురించి సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అయితే పూరి మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు. గతంలో మహేష్ బాబు – పూరి మధ్య విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. అందువల్లే పూరి ఈ వేడుకలను పట్టించుకోలేదని మహేష్ అభిమానులు కూడా గుసగుస లాడుకుంటున్నారు. గతంలో మహేష్ బాబు – పూరి కాంబినేషన్లో పోకిరి – బిజినెస్ మాన్ లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
అయితే గత పదేళ్లలో వీరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. పూరి వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు మహేష్ బాబు కథ చెప్తే ఆయన నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఆ సమయంలో పూరి ఓపెన్ గానే మహేష్ హిట్ సినిమాలు తీస్తుంటేనే పట్టించుకుంటాడు.. ప్లాపులో ఉంటే పట్టించుకోడని స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటినుంచే మహేష్ – పూరి మధ్య బాగా దూరం పెరిగిపోయిందని అంటారు.
ముఖ్యంగా పూరి జనగణమన సినిమాను మహేష్ బాబు హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తీయాలని ప్రయత్నించారు. అయితే అప్పుడు పూరి వరుస ప్లాపుల్లో ఉండడంతో మహేష్ పట్టించుకోలేదని అంటారు. అలా అప్పటినుంచి వీరిద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కనీసం పూరి మహేష్‌కు బర్త్ డే విషెస్ కూడా చెప్పకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!