Samantha: నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్‌ను టేకప్ చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న చిత్రాల్లో `యశోద` ఒకటి. హరీష్ శంకర్, హరీష్ నారాయణ్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు ఉన్నిముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 12న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా `లాల్ సింగ్ చద్దా`, `కోబ్రా`, `మాచర్ల నియోజకవర్గం`, `లాఠీ` వంటి సినిమాలు అదే తేదీన రిలీజ్ అయ్యేందుకు క్యూ కట్టాయి. అఖిల్, సురేందర్ రెడ్డి కాంబోలో రూపుదిద్దుకుంటున్న `ఏజెంట్` మూవీకి అదే తేదీకి లాక్ అయింది.
ఇన్ని చిత్రాలు ఒకే రోజు విడుదలైతే థియేటర్లు పంచుకోవాల్సి వస్తుంది. టాక్ బాగుతున్నా దాని ప్రభావం ఓపెనింగ్స్ పై గట్టిగా పడుతుంది. అందుకే సమంత మనసు మార్చుకుని రిస్క్ వద్దనుకుంటోందట. అన్ని చిత్రాల మధ్య నలిగిపోయి ఇబ్బంది పడే కంటే మరో డేట్‌ను ఎంచుకోవడం మంచిదని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాదు, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే బాక్సాఫీస్ పోటీ నుండి యశోద ఔట్ అవుతుందా..లేదా..అన్నది చూడాలి.