Yukthi Thareja Photo Story: ఆ విషయం లో మాత్రం అస్సలు తగ్గేదే లేదు అంటున్న యుక్తి తరేజా… ఈ ఫోటోలు చూస్తే మిగిలిన హీరోయిన్లను మర్చిపోయి రోజు యుక్తి తరేజా నే గుర్తుచేసుకుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లకు కొదవే లేదు, సినీ ఇండస్ట్రీలో రాణించాలని చాలా మంది దేశాలు, రాష్ట్రాలు దాటి టాలీవుడ్‌కు వస్తుంటారు. అలా వచ్చిన చాలా మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. అలాంటి వారిలో ‘రంగబలి’ మూవీ హీరోయిన్ యుక్తి తరేజా ఒకరు.

తన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ ఇండస్ట్రీలో ప్రస్తుతం దూసుకెళ్తోంది. తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. సినిమాల్లో రాణించడానికి ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు. అయితే ఈ బ్యూటీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు తెలుసుకుందాం..

యుక్తి తరేజా జననం, కెరీర్..
యుక్తి తరేజా 2001 జనవరి 5వ తేదీన హర్యానా రాష్ట్రంలోని కైతాల్ జిల్లా కేంద్రంలో జన్మించారు. ఆమె తండ్రి పర్వీన్ తరేజా, తల్లి రీటా తరేజా. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ (కామర్స్) చదివింది. ఆ యూనివర్సిటీలోనే ఆమె జీవితం మలుపు తిరిగింది. యూనివర్సిటీలో నిర్వహించే డాన్స్ పోటీలు, ప్రదర్శన పోటీల్లో ఎంతో చురుకుగా పాల్గొనేది. ఆ తర్వాత మోడలింగ్‌పై దృష్టి సారించింది.

2019లో ఎంటీవీ ‘సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్’లో పోటీ కూడా చేసింది. 2021 ఫిబ్రవరిలో ఆమె ఇమ్రాన్ హష్మీతో కలిసి జుబిన్ నౌటియల్ పాడిన ‘లుట్ గయే’ పాటకు చిత్రీకరించిన మ్యూజిక్ వీడియోలో యుక్తి తరేజా నటించారు.

ఈ వీడియో అప్పట్లో సెన్సెషన్ అయింది. ముగ్గురు వ్యక్తులు ఒక వధువును ఎలా చంపారు? ఆ తర్వాత వారిని ఎన్‌కౌంటర్‌లో ఎలా కాల్చి చంపారు? వంటి థీమ్‌తో సాగే వీడియోను రూపొందించారు. ఈ వీడియో ఆల్బమ్‌తో యుక్తి తరేజాకు మంచి గుర్తింపు వచ్చింది.

‘రంగబలి’లో ఛాన్స్..
‘లుట్ గేయే’ పాటకు మంచి గుర్తింపు రావడంతో యుక్తి తరేజాకు ‘రంగబలి’ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా నాగ శౌర్య నటించారు. జులై 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది. ఓటీటీలోనూ అదే దూకుడు ప్రదర్శించింది.

నెట్‌ఫిక్స్‌లో విడుదలైన ఈ సినిమా వరుసగా వారం రోజులపాటు ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో ‘రంగబలి’ ట్రెండ్ అవుతూ నిలవడం విశేషం. ఈ సినిమాలో యుక్తి తరేజా వైద్య విద్యార్థిని ‘సహజ’ పాత్రలో నటించింది. ఇది తన వ్యక్తిత్వానికి దగ్గరైన పాత్ర అనే చెప్పుకోవచ్చు. తన మాతృ భాష హిందీ అయినప్పటికీ తెలుగులో అత్యంతద్భుతంగా నటించింది. ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

యుక్తి ఆ నటుడికి బిగ్ ఫ్యాన్…
యుక్తి తరేజాకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. స్వతహాగా మోడలింగ్ అంటే ఎంతో ఇష్టపడే యుక్తికి అల్లుఅర్జున్ స్టైలిష్ లుక్ భలే నచ్చుతాయట. అల్లు అర్జున్ డ్యాన్స్, లుక్స్, యాక్టింగ్‌కి తాను పెద్ద ఫ్యాన్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. హీరోయిన్లలో టాలీవుడ్ సీనియర్ నటి అనుష్క అంటే అభిమానమని యుక్తి తరేజా చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్ చేయాలని పలు సందర్భాల్లో ఆమె తన మనసులో ఉన్న మాటని చెప్పుకొచ్చారు. ఫుడ్, ట్రావెలింగ్ అంటే కూడా ఇష్టమట.

సోషల్ మీడియాలోనూ క్రేజ్ ఎక్కువే..
ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు యుక్తి తరేజా. తనకు సంబంధించిన డైలీ అప్‌డేట్స్‌ను ఫోటోలు, వీడియోల రూపంలో షేర్ చేస్తుంటారు. ‘రియల్ యుక్తి’ పేరుతో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. 7.69కే ఫాలొవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును తన వైపు తిప్పుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ఈ భామ పోస్ట్ చేసిన పోటీలు, వీడియోలకు లక్షల్లో వ్యూవ్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో తన ట్రెండీ లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్‌తో అదిరిపోయే అందాలను ఆరబోస్తూ నెటిజన్లను మత్తెక్కిస్తోంది. ‘రంగబలి’ సినిమా సక్సెస్ తర్వాత యుక్తి తరేజాకు సినీ అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో మరో హిట్ అందుకుంటే హీరోయిన్‌గా గుర్తింపు పొందే అవకాశం ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు