26.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
ఫ్యాక్ట్ చెక్‌

Break Up: బ్రేక్ అప్ తర్వాత మీరు అవతలవారిని క్షమిస్తున్నారా?అయితే దాని వలన జరిగేది ఇదే !!

Share

Break Up: ఎక్కువ సమయం
బ్రేక్ అప్ ని ఇలా వాడి చూడండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీకు సంతోషాన్నిచ్చే పనులు  ఏమి ఉన్నాయో వాటిని చేయండి. మీ అభిరుచులకు ప్రాణం పోయండి.  మీకు వంట అంటే  ఇష్టమైతే  అప్పుడు వివిధ రకాల వంటకాలు చేయడం  కోసం   ప్రయోగాలు చేసి, మీ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకొండి. ఒకవేళ మీకు ట్రెక్కింగ్ అంటే  ఇష్టమైతే  కనుక  అందమైన పర్వతారోహణలకు వెళ్ళండి. మీరు ప్రకృతిని చూసి పరివసించి పోయేవారయితే   ప్రకృతిలో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోండి. డాన్స్,  పాడడం , పెయింట్ చేయండి, కవిత్వం రాయడం, గిటార్  ఇలా మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది   చేసినప్పుడు  మీరు ఆనందంగా ఉంటారు ముందుకు వెళ్ళడానికి  తగినంత బలాన్ని పొందుతారు.కాబట్టి  మిమ్మల్ని మీరు హృదయపూర్వకంగా ప్రేమించండి.  ఎందుకంటే తనను తాను ప్రేమించగల వ్యక్తి వేరొకరిని కూడా ప్రేమించగలడు.

Break Up: క్షమా గుణం

ఆనందం మిమ్మల్ని ఆకర్షణీయమైన వ్యక్తిగా చేస్తుంది.జరిగిపోయినవాటి గురించి ఆలోచిస్తూ అందమైన భవిష్యత్తును అంధకారం చేసుకోకండి.  మీరు జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారు? మీ కెరీర్‌లో  మీకు ఎలాంటి  లక్ష్యాలు ఉన్నాయి ? మీ శరీరం ఎలా  ఉంటే బావుంటుంది అని అనుకుంటున్నారు? మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి? సమయం తీసుకుని మరి మీ జీవితంలో లక్ష్యాల గురించి ఆలోచించండి. మీ లక్ష్యాలను సాధించడానికి ఏం చేయాలో  ప్లాన్ చేసుకుని మరి వెంటాడి మరి  మీ లక్ష్యాలను సాధించండి.దానికోసం బాగా శ్రమ పడండి … ఆ శ్రమ నే మనస్సులో ఉన్న గాయాన్ని చాలా త్వరగా మాన్పుతుంది అని గుర్తు పెట్టుకోండి. క్షమా గుణం కలిగి ఉండడం అనేది  జీవితంలో చాలా ముఖ్యం. మీరు అవతలి వ్యక్తిని  కషమించకపోతే  మీరే  ఎక్కువగా నెగెటివిటీ లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.  దానివల్ల మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టలేరు.  వారి వలన జీవితానికి సరిపడా పాఠం నేర్చుకున్నాను అని   అనుకుని వాళ్ళని క్షమించండి.అలా చేయడం వలన మీలో ఒక గొప్ప శక్తి వచ్చి చేరుతుంది. పంచుకుంటే బాధ  చాలా తగ్గుతుంది. బ్రేక్ అప్ జరిగినప్పుడు ఒంటరిగా  బాధపడుతూ కూర్చోకండి.

బ్రేక్ ఆప్  అనేది

మీ  బెస్ట్ ఫ్రెండ్ తో షేర్ చేసుకోండి.  మీ కుటుంబ సభ్యులతో మీ బాధని  షేర్ చేసుకోండి .ఇక్కడ గుర్తు ఉంచుకోవాలిసిన విషయం ఏమిటంటే రోజులు గడిచే కొద్దీ ఎలాంటి బాధ అయినా తగ్గుతుంది కానట్టి కాస్త ఓర్పుగా ఉండి  మీ కుటుంబ సభ్యులతో,లేదా స్నేహితులతో  సంతోషం గా సమయాన్ని గడపండి.బ్రేక్ అప్  తర్వాత కుమిలి పోకుండా  ముందుకు సాగడానికి మీకు సహాయపడే   సూచనలు ఇవి.  బ్రేక్ ఆప్  అనేది  చాలా మందికి జరిగేదే. అది కూడా జీవితంలో ఒక భాగం.అది ఆ సమయానికి తట్టుకోలేనట్టు అనిపించిన కూడా   అక్కడే  ఆగిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకుండా ముందుకు సాగిపోండి.అవతలి వ్యక్తి నిర్ణయాన్ని గౌరవించండి. తెలివైన వారు ఎప్పుడు సమస్య నుండి బయట పడతారు అందులో చిక్కుకోరు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరే ఆలోచించుకొండి.


Share

Related posts

వివాహ శుభలేఖలలో ఖచ్చితం గా ఉండే జానక్యాహః కమలామలాంజలి శ్లోకం  లో ఉండే రహస్యం తెలుసుకోండి!!

Kumar

ఎవరైనా చనిపోతే కాల్చే ముందు .. కుండకి చిల్లు పెట్టి నీరు కారేలా చేస్తారు – కారణం ఇదే..

Kumar

అదేం ప్రత్యేక దేశం కాదు..! ఐరాస ప్రకటన

Srinivas Manem