NewsOrbit
ఫ్యాక్ట్ చెక్‌

కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..

కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..

మీ వ్యాపారం పెరగాలన్న ఎవ్వరైనా పెట్టుబడులు పెట్టాలన్న మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండటం అనేది ప్రదానం. అసలు మీ వ్యాపారం ఏంటో..? దాని నుండి  లాభాలు ఎలా వస్తాయో దానికి సంబందించిన సమాచారం మొత్తం వివరించి  చెప్పగలిగే నైపుణ్యం మీకు ఉండాలి. మీరు అలా చేయలేకపోతే మీకు పెట్టుబడులు రావడం కష్టం గా మారుతుంది.

కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..

మీ మాట నైపుణ్యం మెరుగుపరుచుకోవడానికి  కొన్ని కోర్సుల్లో చేరవచ్చు . మీ మాట యొక్క నైపుణ్యం తో మీ నెట్‌వర్క్ కూడా పెరుగుతుంది. మీరు ఎప్పుడో దేనిగురించో నేర్చుకొని ఉంటారు. ఇప్పుడు దానికి సంబంధించిన వ్యాపారం చేయాలనుకుంటే ,ఆ నైపుణ్యాలను బాగా మెరుగుపర్చుకోవడం  చాల అవసరం. ఎందుకంటే ప్రపంచం ఎంతో  వేగంగా మార్పు సంతరించుకుంటుంది. మీరు ఎప్పుడో నేర్చుకున్నది ఇప్పుడు పాతది అయిపోయి ఉండొచ్చు. అందుకే… కొత్తగా మళ్ళి దానికి సంబందించిన  కోర్సు లో చేరి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం అనేది  మీకు ఎంతగానో ఉపయోగ పడుతుంది.

అయితే బాగా గుర్తు పెట్టుకోవాలిసిన  మరొక విషయం ఏమిటంటే ,ఏ వ్యాపారం చేయాలనుకున్న దానికి కొంత అనుభవం అవసరం . దాని కోసం మీరు  చేయాలనుకున్న వ్యాపార రానికి సంబందించి సంస్థలలో కొద్దికాలం పనిచేసి  అక్కడ ఉండే  పరిస్థితులు అంచనా వేయగలగాలి ఆ సంస్థలో ఉండే చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకు  ఎలాంటి పని ఉంటుంది ?ఎలా చేయాలి ?అందులో ఉండే  కష్ట నష్టాల గురించి మీరు స్వయం గా తెలుసుకోవడం అనేది మీరు చేయబోయే వ్యాపారానికి గట్టిపునాది అవుతుందని మర్చిపోకండి ఉపాధి లేని గృహిణులు, స్థిరపడ్డ స్త్రీ లు చాలామందే ఉన్నారు.

వారిని మీ వ్యాపారంలో భాగస్వాములను చేసుకోవాలంటే  మెంటార్‌షిప్ కోర్సులు చేయాలి. చాల  సంస్థలు ఇందుకు సహకరిస్తాయి. మీరు సలహాదారులుగా మారి మీ వ్యాపారాన్ని పెంచుకోవడమే కోవడమే కాకుండా,మహిళలకు ఉపాధి అవకాశాలూ కల్పించినట్టు అవుతుంది . సరైన బిజినెస్ మోడల్స్ లేకపోవడం ఇన్వెస్టర్లను ఆకర్షించలేకపోవడానికి కారణం గా చెప్పవచ్చు . ముందుగా కార్పొరేట్ నెట్‌వర్కింగ్ కల్చర్‌ గురించి బాగా తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రజెంటేషన్స్ తయారు చేసి మీ వ్యాపారం గురించి వివరించాలి. మీరు మంచి మాటకారి అయితేనే ఇది సాధించగలరు.

పెట్టుబడి దారులను మెప్పించేందుకు అబద్ధాలు మాత్రం చెప్పొద్దు. మీరు సాధించని వాటిని మీ విజయాలుగా చెప్పి నమ్మించే ప్రయత్నం అస్సలు చేయకూడదు . ఆలా చేయడం వలన తర్వాత సమస్య ల్లో పడాల్సి వస్తుంది. విమర్శల్ని మంచి మనస్సుతో స్వాగతించండి, విమర్శించినంత మాత్రాన కుంగిపోవడం వెనుకడుగు వేయడం చేయకూడదు. మీరు ఎక్కడ ఎలాంటి పొరపాట్లు చేశారో తెలుసుకొని వాటిని దిద్దుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారం  అన్నాక చాల విషయాలు తెలుసుకోవాలిసినవి ఉంటాయి, కాబట్టి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ముందులో కొంత ఆశించిన  స్థాయి లో వ్యాపారం లేకపోయినా నిరాశ చెందకుండా ఓర్పుతో మరింత చురుకుగా శ్రద్ధగా ఎక్కడ  పొరపాటు జరుగుతుందో, ఎక్కడ ఏమి చేస్తే వ్యాపారం పుంజుకుంటుందో వెదికి, వెదికి ఆ అంశాన్ని పట్టుకుని పట్టుదలతో కృషిచేసి  విజయం సాధించండి .

Related posts

TTD: రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదు .. వాస్తవం ఇది

sharma somaraju

Babar Azam Viral Video: సోషల్ మీడియాని కుదిపేస్తున్న పాక్ కెప్టెన్  బాబర్ ఆజమ్ ఫోటోలు, వీడియోలు, చాటింగ్, ఆడియోలు..!!

sekhar

Fact Check: రష్యా కుటుంబ కలహాల వీడియోని.. మతాల మధ్య చిచ్చుపెట్టే వీడియోగా చిత్రీకరించిన మతోన్మాదులు..!!

sekhar

Fact Check: సౌదీ అరేబియా ఫుట్బాల్ ఆటగాళ్ల కోసం రోల్స్ రాయిస్..

bharani jella

Botsa Satyanarayana: కరెంటు బిల్లులు కట్టలేదని బొత్సకు TSSPDCL ఫైన్ .. ఫేక్ న్యూస్..!!

sekhar

Break Up: బ్రేక్ అప్ తర్వాత మీరు అవతలవారిని క్షమిస్తున్నారా?అయితే దాని వలన జరిగేది ఇదే !!

siddhu

Lucky Day: మనిషి మీద పక్షి రెట్ట వేయడం,చూసుకోకుండా బట్టలు తిరగేసి వేసుకోవడం   వేటికి  సంకేతాలో తెలుసా?

siddhu

Late Marriage:  ఎలాంటి గ్రహ దోషం ఉండి వివాహం ఆలస్యం అవుతున్న ఈ పరిహారం చేసుకోండి !!

siddhu

Confusion: ఎవరికైనా ఏ విషయానికి అయినా ‘NO’ అని  చెప్పాలని ఉన్న..  చెప్పలేక పోతున్నారా??దాని వలన జరిగేది ఇదే !!

siddhu

Windows OS Errors: విండోస్ ఓఎస్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది..!? టెన్షన్ పెట్టిన మైక్రోసాఫ్ట్..!

Srinivas Manem

black fungus: ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌.. అస‌లు విష‌యం తెలిస్తే..

sridhar

Thippathega: తిప్ప తీగ ఔషధ ఉపయోగాలు | సైడ్ ఎఫెక్ట్స్

Srinivas Manem

Chappals : చెప్పులకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా ??

Kumar

Gas cylinder: గ్యాస్ సిలిండర్ ఇంకా ఎన్ని రోజులు వస్తుందో ఇలా చెక్ చేసుకోండి!!

Kumar

మ్యాజిక్: ఇసుకను మండిస్తే బంగారం పొందవచ్చు..?

Teja