జగన్ ని బాగా గోకి..! బాబు తప్పులను బయటపెడుతున్న ఆంధ్రజ్యోతి..!!

పాపం తెలుగు మీడియా నాయకుల అజెండాలు మోస్తూ ఎక్కుతూ…, కులాల జెండాలు కడుతూ.., జర్నలిజం విలువలకు “దీపం” పెడుతుంది. ఇది నూరుపాళ్లు నిజమే అయినా ఎవరి ప్రాధాన్యాలు వారికున్నాయి.., ఎవరి భజనలు వారికున్నాయి. అందులో మరి ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమిటో… చంద్రబాబు గోకితే దురద అనేట్టు చూస్తాడు.., జగన్ గోకితే గజ్జి అని క్రియేట్ చేస్తాడు. మరీ ఇంతింత పెద్ద మాటలు ఎందుకులే కానీ.., సింపుల్ గా విషయం చెప్పుకుందాం..!! ఈ ఆర్కే అనే కుల జర్నలిస్టుకి విపరీతమైన తెలివి ముదురుతోంది. తన తెలివితో.., తన రాతలతో జగన్ ని ఎలా అయినా ముప్పుతిప్పలు పెట్టేయ్యాలి.., చంద్రబాబుని ఎలా అయినా కుర్చీ ఎక్కించేయాలి అని తపస్సు ఆరంభించాడు..! అయితే ఆ తెలివి బెడిసికొట్టి.., తన రాజగురువు, కులగురువు అయిన చంద్రబాబు చేసిన పాపాలే బయటకు వస్తుండడం కొసమెరుపు..!

andhrajyothi exposing chandraabu mistakes him self
andhrajyothi exposing chandraabu mistakes him self

పెన్ను ఉంది కదా అని రాసేస్తేరా.. ఆర్కే గారూ..

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ స్థాయిలో వెలిగిపోవాలని అనుకుంటున్నారా.., జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారా..? అంటూ కొన్ని సెటైర్లు జోడించి ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో రూ. 8.15 కోట్లకి ఒప్పందం చేసుకుని, పెయిడ్ ఆర్టికల్స్ వేయించుకుంటున్నారు అనేది ఆ కథనం సారాంశం. ప్రభుత్వ అధినేత జగన్ తో పాటూ.., కొందరు మంత్రులు, ప్రభుత్వ అధికారులు.. పూర్తిగా ప్రభుత్వం సూపర్ గా పని చేస్తుంది అంటూ రాయాలి అనేది ఈ ఒప్పందం ఉద్దేశమట. ఏపీలో చేసిన అభివృద్ధి, పథకాలు ఢిల్లీ స్థాయిలో పేరు మార్మోగిపోవాలని జగన్ ఇలా చేశారట. ఈ వివరాలతో ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాసి దీనికి “సర్కారు వారి భజన పాట” అనే పేరు కూడా పెట్టారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన ట్విస్టు ఉంది.

గురువింద గింజ సామెత.. తెలుసా ఆర్కే గారూ..

చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఏడాది కాలానికే (2017-18) జాతీయస్థాయిలో ప్రమోషన్ల కోసం ఏకంగా 25కోట్లు ఖర్చు చేశారు. ఆంధ్రజ్యోతి రాసినట్టు ఇది జగన్ తో మొదలవలేదు. ఆంధ్రజ్యోతి రాతలకు మూలాలలన్నీ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుతో మొదలైనవే అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆంధ్రజ్యోతిలో ఇటువంటి రాతలు రాగానే వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబు లోగుట్టును బయటకు తీస్తోంది. తన రాతలకే 2019లో బాబు ఓడిపోయారన్న అపవాదు చెరుపుకోకుండా.. చంద్రబాబు గ్రాఫ్ ను మరింత పాతాళానికి స్వయంగా నెట్టేస్తున్నారు.. ఆంధ్రజ్యోతి ఆర్కే వారు. చంద్రబాబు మీడియా పబ్లిసిటీ పిచ్చి ఖర్చు ఆర్కే కంటికి ఇంపుగా కనిపించింది. ఆర్కే మనసులో జగన్ పై గూడు కట్టుకున్న ధ్వేషం ఇలా బయటకు వస్తోంది. కాస్త కళ్లు తెరిచి చూడండి ఆర్కే గారూ..!