NewsOrbit
Featured జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

దేశంలో రెండే పార్టీలు..! బీజేపీ భిన్న స్ట్రాటజీ..!!

దేశంలో రాజకీయ పార్టీలకు కొదవే లేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, లెఫ్ట్, ఎస్పీ, ఎన్సీపీ, శివసేన, టీడీపీ, వైసీపీ, ఆర్జేడీ, టీఆరెస్.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందల్లో జాబితా వస్తుంది. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క. బీజేపీ అమలు చేస్తున్న ఒక స్ట్రాటజీ ప్రకారం.., మోడీ, అమిత్ షా బుర్రలో మెదులుతున్న కొన్ని ఐడియాలు ప్రకారం దేశంలో రెండే పార్టీలు (రాజకీయ వేదికలు) మిగలబోతున్నాయి. అది బీజేపీ ఒకటి, బీజేపీ యేతర మరొకటి..!! మిగిలిన పార్టీలు ఏమవుతాయి అనే సందేహాలు.., ఎందుకు ఇలా అనే అనుమానాలు వస్తున్నాయా..?? కొంచెం లోతుగా విశ్లేషించుకుందాం..!!

Modi amit shah file photo

కొన్ని రాష్ట్రాల్లో చూద్దాం..!!

తెలంగాణాలో కాంగ్రెస్ కొన ఊపిరితో ఉంది. టీడీపీ చచ్చిపోయింది. ఈ రెండు స్థానాలను బీజేపీ ఆక్రమించింది. అంటే అక్కడ టీఆరెస్ అధికార పక్షం, బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నట్టు. 2023 నాటికి సీన్ రివర్స్ చేయాలనేది బీజేపీ వ్యూహం.
* ఇప్పుడు బెంగాల్ లో కూడా అదే లెక్క. అక్కడా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు చావు బతుకుల్లో ఉన్నాయి. అక్కడ దశాబ్దాల తరబడి త్రికోణ పోటీ జరిగితే ఇప్పుడు మాత్రం తృణమూల్ కి, బీజేపీకి ప్రధాన పోటీగా మారిపోయింది. సో.. అక్కడ కూడా రెండే పార్టీలు. బీజేపీ ఉంటె అధికార పక్షంలో లేదా ప్రతిపక్షంలో..!
* ఏపీలో ఒకసారి చూసుకుంటే.. వైసీపీ బలంగా ఉంది. టీడీపీని ఒక వైపు వైసీపీ, మరోవైపు బీజేపీ కలిసి టార్గెట్ చేస్తున్నాయి. అంటే టీడీపీని చంపేసి.., ఆ స్థానాన్ని ఆక్రమించాలి అనే సుదీర్ఘ వ్యూహంతో బీజేపీ ఉంది. టీడీపీ లేకపోతే వైసీపీని ఈజీగా ఆడుకోవచ్చు అనేది బీజేపీ ఆలోచన..! ఇక్కడ మాత్రం బీజేపీ ఆలోచనలు అమలవ్వడం కష్టమే. కొద్దీ నెలల్లో స్పష్టత వస్తుంది.

West bengal Elections : BJP Ready with Bihar Plan
* ఇలా తమిళనాడు, బీహార్, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఉంటె అధికారంలో లేదా ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధ పడుతుంది. సో.. రాష్ట్రాల్లో రెండే పక్షాలు ఉండేలా బీజేపీ చూసుకుంటుంది. 2014 నుండి నెమ్మదిగా ఇదే స్ట్రాటజీని అమలు చేస్తూ.. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో సాధించగలిగింది.

* దేశంలో కాంగ్రెస్ ని బలహీనం చేసి. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బలహీనం చేసి. ఆ స్థానాలను ఆక్రమించాలి అనేది బీజేపీ లెక్క. దేశం మొత్తం మీద, రాష్ట్రాల్లోనూ రెండు పార్టీలు మాత్రమే ఉంటె.. తమకు సులువు అవుతుంది అని సుదీర్ఘ ఆలోచనతో అమిత్ షా బృందం ఉంది.

ఇప్పుడు బెంగాల్.. తర్వాత తమిళనాడు..!!

పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది మర్చి, ఏప్రిల్ మధ్య ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ తృణమూల్ ని దించేసి, అధికారంలో ఉండాలి అనేది బీజేపీ అతిపెద్ద వ్యూహం. అందుకే అమిత్ షా రోజులో 18 గంటలు ఆ రాష్ట్ర వ్యవహారాలపైనే దృష్టి పెడుతున్నారు. తన టీమ్ లో 120 మందిని బెంగాల్లో పెట్టి అనునిత్యం నడిపిస్తున్నారు. ఢిల్లీ నుండి పావులు కదుపుతున్నారు. ఇప్పుడు బీజేపీ ఏకైక లక్ష్యం మమతని ఓడించాలి. ఆ తర్వాత బీజేపీ లక్ష్యం తమిళనాడుపై పడుతుంది. జయలలిత మరణం తర్వాత ఏర్పడిన నాయకత్వ లోటుని పరోక్షంగా దూరి బీజేపీ నియంత్రించగలిగింది. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు, సీట్లు పెద్దగా లేనప్పటికీ ఇప్పుడిప్పుడే ప్రత్యేక స్ట్రాటజిల ద్వారా నెట్టుకొస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్ లోగా జరగనున్న శాసనసభ ఎన్నికల్లో స్టాలిన్ ని ఢీ కొనేలా ఒకవైపు అన్నాడీఎంకె వెనుక ఉంటూ సిద్ధం చేస్తూనే.., మరోవైపు రజని, కమల్ అడుగులను పరిశీలిస్తుంది. సందు చూసుకుని దూరుతోంది. ఆ తర్వాత బీజేపీ పూర్తి దృష్టి ఏపీపై పడుతుంది. ఈ లోగా ఏపీలో జగన్ పాలన, టీడీపీ వ్యవహారంపై బీజేపీకి ఒక అవగాహనా వస్తుంది. తద్వారా ఏపీలో రాజకీయ అడుగులను బీజేపీ నిర్ణయించుకుంటుంది.!!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?