NewsOrbit
Featured బిగ్ స్టోరీ

కులం కుంపటి రగిలించిదెవరు?

TDP Janasena: CM Seat offer for Pavan Kalyan.. is it True..!?

 

టైమ్‎కు కులానికి సంబంధమేంటి?

దేశంలో మతాలున్నాయి. మత ప్రాతిపదికన దేశం రెండు ముక్కలయ్యింది. తర్వాత కులాల ప్రస్తావనతో అగ్రవర్ణాలు, బహుజనులు, దళితులు అంటూ వర్ణాలు ఏర్పడ్డాయ్. తర్వాత అగ్రవర్ణాల్లో పలానా కులం… పలానా కులం అంటూ చెప్పుకోవడం మొదలయ్యింది. ఇక అట్టుడుగు వర్గాలు కులం పేరుతో ఛిన్నాభిన్నమైపోయాయ్… ఇక తెలుగు నేలపై కుల ప్రభావం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వెనకటికి ఒకాయన బెజవాడ బెంజ్ సర్కిల్లో… టైమెంతండీ అని అడిగితే మీరేమిట్లండీ అన్నారట… ఇది విభజిత ఆంధ్రప్రదేశ్‎లో స్పష్టమైన సీన్. అంతేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ సర్కారు తట్టాబుట్టా సద్దాక… బెజవాడ, గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో కుల ప్రాతిపదికన ఇళ్లను రెంట్‎కు ఇచ్చిన వార్తలు మీడియాలో కొకొల్లలు… ఈ సోదంతా ఏంటని అనుకుంటున్నారా…

Caste is the culprit in AP, Who is blame for this
Caste is the culprit in AP Who is blame for this

అమరావతిలో ఎస్సీలు, బీసీలు, ముస్లింలూ ఉన్నారు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడూ మాట్లాడని కుల గురించి ఇప్పుడు మాబాగా మాట్లాడేస్తున్నారు… హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశా… అప్పుడు లేని కులం అమరావతిలోనే వచ్చిందా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. 30 ఏళ్లుగా కుప్పంలో ఒకే కుంలం వారు నాకు ఓట్లేస్తున్నారా… జగన్ వచ్చిన నాటి నుంచే కులం అంటగడుతున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు…. నిజంగా ఎంతో అయోమయాన్ని కలిగిస్తున్నాయ్… అంతే కాదు… అమరావతి గురించి ఎన్నో దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని… అనవసరంగా ప్రజల మనసులను కలుషితం చేస్తున్నారని ఆయన అంటున్నారు. అంతే కాకుండా… అమరావతిలో ఒకే కులం ఉందా… చుట్టుపక్కలన్నీ ఎస్సీ నియోజకవర్గాలే… బీసీలు, ముస్లింలు కూడా ఎక్కువే ఉన్నారు. వైసీపీ నేతలు కొందరు నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నారని… కావాలనే ప్రయోజనాలను అంటగడుతున్నారంటూ చంద్రబాబు విమర్శించారు. అమరావతిలో సెంటు భూమి కొనలేదని… రైతులకు అన్నీ సమకూర్చాక స్థలం తీసుకొని… ఇల్లు కడదామనుకున్నా… కట్టలేక పోయా… అయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారు…

బయటకు ఒకరు కన్పిస్తారు.. మరొకరు కన్పించరు…

రెండు పార్టీల గురించి రెండు క్లిష్టర్ క్లియర్ భేదాభిప్రాయాలున్నాయ్. ఒకరు గుట్టుగా సైలెంట్ గా చాప కింద నీరులా పనికానించేస్తారు. కానీ మరొకరు… పబ్లిగ్గా చేసేస్తారు. తడిగుడ్డతో ఒకరు గొంతు కొస్తే మరొకరు పబ్లిక్ గా కొస్తారంటూ విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయ్. ఇలాంటి సందర్భంలో అమరావతి గురించి అందరూ ఒకటే చెబుతున్నారు. రాజధాని భూములు, డబ్బు రెండూ అంశాలనే చూస్తున్నారని గానీ… మిగతా ఏమీ కూడా పట్టించుకోవడం లేదన్నది ఆ ఆరోపణ. వాస్తవానికి చంద్రబాబు ఉన్న భ్రమరావతి కాన్సెప్ట్ కేవలం… అలాంటి ఆలోచనలతోనే ముందుకు సాగలేదు. రాజధాని విషయంలో చేసిన జాప్యం… నిబంధనల రూపాకల్పన… క్విడ్ ప్రొకో లాంటి ఎన్నో విమర్శలు అమరావతికి శాపంగా మారాయ్… జరిగేది జరగకమానదు… జరగనిది ఎన్నటికీ జరగదు… ఈ చిన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు గ్రహించడం లేదు.

ఏపీలో కులం ఇప్పుడు మూడుముక్కలాట

ఏపీలో కులం ఇప్పుడో విషపదార్థం. కమ్మలు టీడీపీకి అండగా ఉంటుంటే… రెడ్డి సామాజికవర్గం జగన్ కు బాసటగా నిలిచింది. కానీ గత ఎన్నికల్లో జనసేన చీఫ్ సరైన పంథా లేకుండా ఎన్నికలకు వెళ్లకపోవడం వల్ల రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గం ఎటువైపు మొగ్గాలో తెలియక అయోమయానికి గురయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో… ఇప్పుడు ఆ సామాజికవర్గాన్ని చేరదీసే పనిని కమలం పార్టీ తీసుకుంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏపీ బీజేపీ చీఫ్‎గా ఎన్నికలకు ముందు కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పటికీ… ఆయనపై ఆ ముద్రపడలేదు. కానీ ఇప్పుడు బీజేపీ చీఫ్‎గా వచ్చిన సోము వీర్రాజు కాపు సామాజకవర్గాన్ని ఒకే గొడుకు కిందకు తెచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా కన్పిస్తోంది. అదే జరిగితే… ఏపీలో మూడు ముక్కలాట ఖాయం..

బెజవాడలో చంద్రబాబుకు కుల జబ్బు అంటుంకుందా…?

చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో ఉన్నంత కాలం ఎప్పుడూ కులం గురించి ఆలోచించలేదని… ఆయన ఎప్పుడైతే… మకాం బెజవాడకు మార్చారో అప్పట్నుంచో మారిపోయారంటారు ఆయనకు అత్యంత సన్నిహితులు. బెజవాడలో కొందరు తమ స్వార్థం కోసం రేపిన కుల చిచ్చు గురించి పవన్ కల్యాణ్ ఐదేళ్లలో మాట్లాడిన మాటలు వింటే మళ్లీ మనకు స్మరణకు వస్తాయ్. కానీ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎవరు ఖండించగలరు… అవును మీరు చిన్న డివియేషన్ ఎదుర్కొంటే… అవతల వాళ్లు ఇంకా పెద్ద గ్యాప్ క్రియేట్ చేయగలరు కదా… బీసీల పార్టీ అంటూ మీరు చేసిన ప్రచారం కూడా భస్మీపటలం అయ్యింది. బీసీలు ఇప్పుడు వైసీపీకి దన్నుగా ఉన్నారన్న అభిప్రాయం కూడా బాగా విన్పిస్తోంది. ఇలాంటి సందర్భంలో తన సామాజికవర్గంపై ఉన్న విముఖతను తగ్గించి… సమాజాన్ని అంతటినీ ప్రభావితం చేసేలా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే బాధ్యతను చంద్రబాబు తీసుకోవాలి. లేదంటే అది కేవలం టీడీపీకి మాత్రమే కాదు… ఇంకో రోజు ఎవరికైనా వర్తిస్తుంది.

author avatar
DEVELOPING STORY

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju