NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

సీఎం జగన్ X జస్టిస్ రమణ ; జగన్ పై పిటిషన్ సరే..! లేఖ సంగతి ఏమైనట్టు..!?

YS Jagan Future will decide by this march 5?

సీఎం జగన్ X జస్టిస్ రమణ ఇష్యూ మొదలై నెలరోజులయింది. ఇప్పటికీ చర్చలు, వార్తలు నడుస్తూనే ఉన్నాయి. న్యాయవ్యవస్థలోని వివిధ దశలకు చెందినవారు జగన్ కి వ్యతిరేకంగా లేఖలు రాస్తూనే ఉన్నారు. సరే… అది వారికి వృత్తి పట్ల ఉన్న గౌరవం, ఏపీలో పరిస్థితులపై అవగాహన లేమి అనుకుందాం..!! ఇక సీఎం జగన్ కి వ్యతిరేకంగా సుప్రీం లో పిటిషన్లు దాఖలయిన సంగతి తెలిసిందే. వాటిని విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నెల 16 నుండి విచారణ చేపడతామని పేర్కొంది..! ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంతకూ జగన్ రాసిన లేఖ ఏమైనట్టు..? లేఖపై తదుపరి అడుగులు పడ్డాయా లేదా..? అంతర్గత కదలికలు మొదలయ్యాయా, లేదా..? అదే ఇప్పుడు కీలక అంశం.

బీజేపీ చేతికే బ్రహ్మాస్త్రం..!!

తేనె తుట్టెని కొట్టి తేనె పెట్టుకోకుండా వదిలేస్తే ఆ కష్టం, ఆ రిస్కు వృథా కదా..? తెలిసి తెలిసి జగన్ ఇటువంటి వృథా పనుల కోసం రిస్కులు చేయరు. అందుకే “న్యూస్ ఆర్బిట్” గతంలోనే చెప్పినట్టు ఇది బీజేపీ ఆడుతున్న ఒక స్కెచ్ కావచ్చు. సుప్రీం తదుపరి ప్రధాన న్యాయమూర్తి విషయంలో బీజేపీ ముందస్తుగా ఇలా జగన్ చేత రాయించవచ్చు. లేదా… జగనే తనకు, తన ప్రభుత్వానికి వస్తున్న వ్యతిరేక తీర్పులను తట్టుకోలేక ఇలా రిస్కు చేస్తే చేయవచ్చు. కానీ ఏదైనా బీజేపీ చేతికి బ్రహ్మాస్త్రం చేరినట్టే. దేశంలో వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీకి ఈ తతంగం కూడా నడిపించడం పెద్ద కష్టమేమి కాదు. ఈ లేఖ అడ్డు పెట్టుకుని జస్టిస్ రమణని ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకోవచ్చు.., లేదా “మీపై ఇలా వచ్చినా మేము పట్టించుకోలేదు.., మనం మనం భాయీ భాయీ” అంటూ ఫ్రెండ్షిప్పూ చేయవచ్చు. ఏదయినా ఇక జరిగేది బీజేపీ వ్యహమే..!!

YS Jagan Future will decide by this march 5?

లేఖపై ఏం చేయొచ్చంటే..!? ఇవీ మార్గాలు..!

సీఎం జగన్ రాసిన లేఖపై తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక స్పష్టత లేదు. ఆ లేఖ రాసిన సీఎంపై మాత్రం అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయన సీఎం పదవికి అనర్హుడని.., ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని పిటిషన్లు వేశారు. మరో వారం నుండి వాటిని విచారించనున్నారు. ఇక సీఎం రాసిన లేఖపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మూడు విధాలుగా స్పందించే వీలుంది. కోర్టుల్లో న్యాయమూర్తులపై, ప్రధాన న్యాయమూర్తిపై ఇటువంటి ఆరోపణలు, పిర్యాదులు వస్తే ఏం చేయాలి..? అనే విషయమై (ఇన్ హౌస్ కమిటీ విచారణ) రెండు దశాబ్దాల కిందటే విధివిధానాలు రూపొందించింది. దీని ప్రకారం…
* సుప్రీం న్యాయమూర్తి ఎవరిపై అయినా పిర్యాదులు, ఆరోపణలు వస్తే ముందుగా ప్రధాన న్యాయమూర్తి వాటిని పరిశీలిస్తారు. అవి నాన్ జ్యుడీషియరీ (వృత్తి సంబంధం కాకపోతే) పట్టించుకోరు. మరీ సీరియస్ అయితే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వీటిపై సదరు న్యాయమూర్తి నుండి వివరణ తీసుకుని.. అప్రమత్తం చేస్తారు.


* ఒకవేళ జ్యుడీషియరీ (వృత్తి సంబంధిత) ఆరోపణలు వస్తే మూడు విధాలుగా రియాక్షన్ ఉంటుంది. మొదటి దశలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆ పిర్యాదులు సహేతుకం కావు, పెద్దగా సీరియస్ కాదు అనుకుంటే వదిలేయవచ్చు. అంశాలు సీరియస్ అయితే, వాటిపై ప్రాధమికంగా వివరాలు సేకరించి.. సదరు న్యాయమూర్తి నుండి వివరణ తీసుకుంటారు. ఈ వివరణతో ప్రధాన న్యాయమూర్తి నమ్మితే, పిర్యాదుని అక్కడితో ముగించవచ్చు. ఒకవేళ ఈ వివరణ కరెక్ట్ కాదు, ఇంకా ఏదో ఉంది అనుకుంటే హౌస్ కమిటీ విచారణ వేస్తారు. ఇతర న్యాయమూర్తులు, ఒక విశ్రాంత ప్రధాన న్యాయమూర్తితో కమిటీ వేసి, విచారణకు ఆదేశిస్తారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయి.
* సదరు న్యాయమూర్తి తప్పు చేసినట్టు తేలితే అతన్ని రాజీనామా కోరతారు.., లేదా స్వచ్చంధంగా పదవీ విరమణ కోరతారు. అందుకు అంగీకరించకుంటే పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టి… అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో సదరు న్యాయమూర్తిని తొలగిస్తారు.

జగన్ లేఖ అంత దూరం వెళ్లే అవకాశం ఉందా..!?

సీఎం జగన్ రాసిన లేఖ చూసుకుంటే అంత దూరం వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఆ లేఖలో ఎక్కువగా రమణ వ్యక్తిగత అంశాలున్నాయి. కొన్ని జ్యుడీషియరీ అంశాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని ప్రధాన న్యాయమూర్తి ఎంత వరకు పట్టించుకుంటారు అనేది కీలకం. ఇలా ఒక సీఎం… ఒక న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం ఇదే తొలిసారి. బయటకు రావడం లేదు కానీ.. దీనికి న్యాయవ్యవస్థ గిలగిలా కొట్టుకుంటుంది. అంతర్గతంగా చాల చర్చలు జరిగాయి. తప్పులపై ఒక అంతఃసమీక్ష చేసుకునే వరకు వెళ్ళింది. అది ఆ దశలో ఉండగానే.. ఈ అస్త్రాన్ని బీజేపీ తన చేతిలోకి తీసుకుంది. అందుకె ఈ లేఖ పర్యవసానాలు, పరిణామాలు మనం పైన చెప్పుకున్నట్టు బీజేపీ చేతిలోనే ఉంటాయి. చూస్తూ ఉండడమే మన పని..!!

 

author avatar
Srinivas Manem

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!