Featured న్యూస్ సినిమా

Karthika deepam: తింగరే హిమ అని అసలు నిజం తెలుసుకున్న జ్వాల హిమను ఏమి చేసిందో తెలుసా..?

Share

Karthika deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఎన్నో సంవత్సరాల నుండి ప్రేక్షకుల ఆధారాభిమానాలను సొంతం చేసుకుంటూ వస్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.ఆక్సిడెంట్ అయిన ముసలావిడను జ్వల నిరూపమ్ హాస్పిటల్ కు తీసుకుని వస్తుంది.ట్రీట్మెంట్ చేసిన నిరూపమ్ ను ఆవిడకు ఎలా ఉంది డాక్టర్ సాబ్ అని అడుగుతుంది.దాంతో నిరూపమ్ కాసేపట్లో సృహ వస్తుంది అని చెబుతాడు.ఇక ముసలావిడ కు సృహ వస్తుందా లేదా అని హిమ తెగ టెన్షన్ పడిపోతుంది. మరో పక్క జ్వాల అమ్మానాన్నలకు జరిగిన ఆక్సిడెంట్ గురించి తలుచుకుని బాధ పడుతుంది.

Karthika deepam: హిమను మిస్ అయ్యానే అని బాధ పడుతున్న జ్వల :

ఇక జ్వాల నిరూపమ్, హిమ వాళ్ళ దగ్గర నుండి పక్కకు వచ్చి నాన్నమ్మ కొట్టిన దెబ్బను తలుచుకుని బాధ పడుతుంది. హిమ ఎక్కడ ఉందో తెలుసుకునే అవకాశం మిస్ అయ్యానే అని అనుకుంటుంది. ఈ పాటికి హిమకు పెళ్లి అయ్యే ఉంటుందా లేదా అని ఆలోచిస్తుంది. అయినా అది చక్కగా నానమ్మ వాళ్ళతో హ్యాపీగా ఉంది.. నా గురించి మాత్రం ఎవరు కూడా బాధ పడడం లేదు అని మనసులోనే కుంగిపోతుంది.మరోవైపు ఆనంద్ వాళ్ళ పెద్దమ్మను మా అమ్మానాన్నల గురించిన వివరాలు చెప్పు అని పదే పదే అదుగుతూ ఏడుస్తూ ఉంటాడు. దాంతో ఆమె ఆనంద్ పై పెద్దగా అరిచి తిడుతుంది.. నాకు వాళ్ళ గురించి తెలియదు అని ఎన్ని సార్లు చెప్పాలిరా అంటూ తిడుతుంది. సీన్ కట్ చేస్తే సౌందర్య జ్వాలను కొట్టినందుకు తనలో తానే బాధ పడుతూ ఉంటుంది. ఎందుకలా చేశాను అని బాధపడుతూ ఈసారి ఎక్కడైనా కలిస్తే ఆ అమ్మాయికి సారీ చెప్పాలి అని అనుకుంటుంది.

నిరూపమ్ కి హిమను ఇచ్చి పెళ్లి చేయను అని తెగేసి చెప్పిన స్వప్న :

ఇక స్వప్న అనందరావు దగ్గర కూర్చుని నా పిల్లలకు నాకు నచ్చిన అమ్మాయిలతో పెళ్లి చేస్తాను అని అంటుంది. దాంతో ఆనందం రావ్ ఇంట్లో అమ్మాయిని పెట్టుకుని బయటవాళ్లకి ఇచ్చి పెళ్లి చేయడం ఏమిటి అని అంటాడు.ఇక దాంతో స్వప్న కోపంగా డాడీ హిమ అంటే నాకు ఇష్టం లేదు అది ఒక నష్ట జాతకురాలు, అంతే కాకుండా మీ చుట్టరికం మాకు అవసరం లేదు అని అంటుంది.

నిజం తెలుసుకున్న జ్వల… కోపంలో హిమను ఏమి చేసిందంటే..?

మరోవైపు హిమ, జ్వాలలు ఒకచోట కూర్చుని ఉండగా అక్కడికి సౌందర్య,ఆనందరావు వస్తారు. జ్వాల గురించి వివరాలు అడుగగా హిమ తన చేతికున్న పచ్చబొట్టు చూపించి జ్వాలనే సౌర్య నానమ్మ అని అంటుంది. దాంతో ఆనంద రావు దంపతులు ఎంతో సంతోష పడతారు. కానీ సౌర్య మాత్రం కోపంగా ఆపండి మీ కపట ప్రేమలు అని అంటుంది. అదే క్రమంలో ఆనందరావు అది నీ హిమ అనగా కాద అది నా శత్రువు అని హిమపై విరుచుకు పడుతుంది. ఇన్నాళ్ళూ నా పక్కనే ఉండి నన్ను మోసం చేసింది అని హిమను సౌర్య కోపంగా నెట్టేస్తుంది.అయితే ఇదంతా హిమ కలగంటుంది. నిద్రలోంచి లేచి బాధపడుతూ ఇంకా ఎన్నాళ్లు నిన్ను ఇలా నిజం చెప్పకుండా మోసం చేయాలి సౌర్య అని బాధ పడుతుంది..ఇక రేపటి ఎపిసోడ్ లో జ్వల ఆటోను ఆనంద్ రావు, సౌందర్య దంపతులు ఎక్కడంతో రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగుతుందనే చెప్పాలి.


Share

Related posts

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక వాయిదా..!!

sekhar

Ukraine Crisis: ఉక్రెయిన్ లోని తెలుగు విద్యార్ధుల కోసం ఏపి సర్కార్ కీలక నిర్ణయం

somaraju sharma

రేషన్ డీలర్లకు వరం

Siva Prasad