గట్టిగా, పొట్టిగా ఉండి చూడటానికి తళతళ మెరిస్తూ కనిపించే అవిసెలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే.. మీరు అసలు వాటిని వదలరు. చాలా మందికి ఇవి ఇప్పుడు సూపర్ ఫుడ్స్ జాబితాలో టాప్ లో ఉంటున్నాయి. ఈ అవిసె గింజలను పలు రకాలుగా వారి ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. పలు రకాల వంటల్లో వాడుతూ.. వారి ఆరోగ్యాన్ని పదిలం చేసుకుంటున్నారు. ఈ అవిసెలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. అయితే మీరు కూడా ఈ గింజలతో కలిగే లాభాలను తెలుసుకోండి.
ఈ అవిసె గింజల్లో మనకు ఉపయోగపడే చాలా పోషకాలుంటాయి. ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అవిసెల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటాయి. వీటితో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ అవిసె గింజలకు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. వాటివలన బ్రెస్ట్, ప్రోస్టేట్ కాన్సర్లతోపాటు మరికొన్ని కాన్సర్లను కూడా నిరోధించగలవని తెలుస్తోంది.
ఈ గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని చాలా బాగా మెరుగు పరుస్తుంది. కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. ఈ అవిసె గింజలు బీపీని కూడా కంట్రోల్ చేస్తాయి. హైబీపీ ఉన్నవారికి ఇవి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. శాఖాహారులకు ఈ అవిసె గింజల ద్వారా.. బెస్ట్ ప్రోటీన్స్ లభిస్తాయి. ఈ అవిసెలను తినడంతో కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో తినే ఆహారం తక్కువగా తీసుకుంటాం. అలా చేయడం వలన స్థూలకాయులు తొందరగా బరువు తగ్గుతారు.
అయితే ఈ గింజలను నేరుగా తినడం కష్టంతో కూడిన పని, అలాగే అవి అరగవు. దాంతో శరీరం గ్రహించుకోలేదు. అందుకే వాటిని పొడికొట్టి తీసుకోవాలి. లేకుంటే నానబెట్టుకుని తీసుకోవాలి.