NewsOrbit
Featured బిగ్ స్టోరీ

దసరా రోజున విశాఖలో రాజధాని శంకుస్థాపన…!! మోదీ రాక ఫిక్స్…!!

నాడు విజయ దశమని నాడే అమారావతిలో భూమిపూజ

అన్నింటికీ..అందరికీ అదే సమాధానంగా…

ఏపీ మూడు రాజధానుల వ్యవహారం పైన ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు చట్టంగా రూపాంతరం చెందాయి. అయితే, దీని పైప అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించటంతో..ఈ నెల 14వ తేదీ వరకు స్టేటస్ కో మెయిన్ టెయిన్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం ఈ నెల 16న విశాఖలో పరిపాలనా రాజధానికి శంకుస్థాపనకు సిద్దం అవుతోంది. ఈ మేరకు ప్రధానిని ఆహ్వానించేందుకు అప్పాయింట్ మెంట్ కోరారు. అయితే, సమయం తక్కువగా ఉండటం..కోర్టులో స్టేటస్ కో ఉండటంతో..దసరా నాటికి ప్రభుత్వం శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లోగా కోర్టు పరంగా న్యాయ పరమమైన ఇబ్బందులు తొలిగించుకోవటంతో పాటుగా..ప్రధానిని కలిసి నేరుగా అదే రోజు శంకుస్థాపనకు రావాలని..వీలు కాకుంటే వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా హాజరయ్యేలా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి ప్రధానిని ఆహ్వానించనున్నారు. ప్రధాని కార్యాలయం నుండి స్పష్టత రాగానే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

MODI, YS JAGAN, YCP MPS
MODI YS JAGAN YCP MPS

దసరా నాడు ప్రధాని చేతుల మీదుగా..

ఏపీలో నూతన పరిపాలనా రాజధానిగా విశాఖకు ప్రధాని చేతుల మీదుగా భూమిపూజ చేయించాలని ముఖ్యమంత్రి జగన్ డిసైడ్ అయ్యారు. వాస్తవంగా ఇప్పటికే మూడు రాజధానుల చట్టం అమల్లోకి రాగా.. హై కోర్టు స్టేటస్ కో మధ్యంతర ఉత్తర్వుల కారణంగా అమలు లో న్యాయ పరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. తొలుత ఈ నెల 16న విశాఖలో కొత్త పరిపాలనా రాజధానికి భూమిపూజకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, హైకోర్టు లో వచ్చిన స్టేటస్ కో ఉత్తర్వుల తో ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అయినా..అక్కడ ఇంకా విచారణకు బెంచ్ మీదకు రాలేదుద. ఇదే సమయంలో ప్రధాని తో శంకుస్థాపన చేయించటం ద్వారా అన్ని విమర్శలకు..అన్ని పార్టీలకు ఈ కార్యక్రమం ద్వారా సమాధానం చెప్పినట్లవుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో..ఇప్పటికిప్పుడు సమయం తక్కువగా ఉండటం.. న్యాయ పరమైన చిక్కులు ఉండటంతో.. విజయ దశమి నాడు విశాఖలో భూమి పూజకు తాజాగా ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా సమయం దొరుకుతుందని..ప్రధానిని స్వయంగా ఆహ్వానించే అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేంద్రం ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పటం ప్రభుత్వానికి కలిసి వచ్చింది. ఇక, ప్రధాని కార్యక్రమానికి హాజరు కావటం ద్వారా విశాఖ ఏపీ పరిపాలనా రాజధాని అనే అంశానికి మరింత సానుకూల ప్రచారం లభిస్తుందనేది ప్రభుత్వ అంచనా.

 

Modi lays foundation for Amaravati
Modi lays foundation for Amaravati

చంద్రబాబు హాయంలోనూ ఇదే ముహూర్తం..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే విజయ దశమి ముహూర్తాన 2015, అక్టోబర్ 21న అమరావతిలో శంకుస్థాపన జరిగింది. ప్రధాని మోదీతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..కేంద్ర మంత్రులు ఆనాడు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఆ తరువాత టీడీపీ…బీజేపీ మధ్య పొత్తు తెగిపోయింది. ఇక, అమరావతి విషయంలో టీడీపీ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిందనేది వైసీపీతో పాటుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అటువంటి అమరావతి నుండి విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించటానికి కేంద్రం వ్యతిరేకం కాదనే విషయం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ స్పష్టం చేస్తోంది. కొందరు బీజేపీ నేతలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పైన సన్నాయి నొక్కులు నొక్కటం..టీడీపీ అధినేత చేస్తున్న విమర్శల నడుమ ప్రధానిని ఆహ్వానించాలని పట్టుదలతో ఉన్న సీఎం ఈ కారణంతోనే విజయ దశమిని ముహూర్తంగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ లోగా న్యాయ పరంగా చిక్కులు తొలిగిపోయేలా ప్రభుత్వం కోర్టుల్లో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక, అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తున్న వేళ..విశాఖ లో శంకుస్థాపనకు ప్రధాని మోదీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హాజరయితే ఏపీ రాజకీయాల్లో వైసీపీకి ముఖ్యంగా జగన్ కు కలిసొచ్చే అంశంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

author avatar
DEVELOPING STORY

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju