NewsOrbit
Featured న్యూస్

Honour Killing in Telangana: కట్టేసి.. తలలో మేకులు కొట్టి.. తెలంగాణాలో మరో దారుణ పరువు హత్య..!?

Honour Killing in Telangana: అమృత, ప్రణయ్.. మారుతీరావు ఈ పేర్లు ఏ ఒక్కరూ మరిచిపోలేరు. తెలుగునేలపై.. తెలంగాణ గడ్డపై ప్రేమని అవమానిస్తూ.. కులాహంకారంతో దారుణ నెత్తుటి మరక అంటించిన కథ అది.. ఆ దారుణాన్ని ఇంకా మర్చిపోక మునుపే అడపాదడపా ఎక్కడక్కాడా దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణాలో మరో పరువు హత్య జరిగింది. దీనిలో కూడా బలయ్యింది అల్లుడే.. ప్రేమికుడే.. అత్యంత కిరాతకంగా తలలో మేకులు కొట్టి చంపేసిన దారుణ ఉదంతం ఇది..!

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రామకృష్ణ గౌడ్ అనే యువకుడు హోంగార్డుగా విధులు నిర్వర్తించేవాడు. రెండు రోజుల కిందట దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భార్గవి తండ్రి వెంకటేశ్ ఇద్దరూ పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలో ఆరితేరిన సుపారీ గ్యాంగ్‌తో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు పరిశీలిస్తే.. భువనగిరి జిల్లా లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ గౌడ్ హోంగార్డుగా పని చేస్తున్నాడు. అయితే గుప్తా నిధుల తవ్వకాల్లో సహకరించాడనే కేసులో అతన్ని పోలీసుశాఖ సస్పెండ్ చేసింది.. అతను హోంగార్డుగా ఉన్న సమయంలోనే యాదాద్రికి చెందిన భార్గవి అనే యువతిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నాడు..!

Honour Murder in Telangana: Ramakrishna Case in Telangana
Honour Killing in Telangana Ramakrishna Case in Telangana

Honour Killing in Telangana: ఇద్దరి కులాలు వేరు.. కానీ..!

భార్గవి ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినది కాగా.. రామకృష్ణ గౌడ సామాజిక వర్గానికి చెందిన కుర్రాడు.. యువతీ తండ్రి కాస్త రాజకీయ పలుకుబడి ఉన్నవాడు, ఆర్ధికంగా స్థితిమంతుడు. దీంతో ఆ కుర్రాడితో పెళ్ళికి నిరాకరించారు. ఈ క్రమంలోనే 2020 ఆగస్టు 16న భార్గవి-రామకృష్ణ పెద్దలకు ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొద్దిరోజులు లింగరాజుపల్లిలో.. ఆ తర్వాత భువనగిరిలో కాపురం పెట్టారు. వీరికి ఒక ఆరునెలల బాబు కూడా ఉన్నాడు. మరోవైపు, భార్గవి తండ్రి దీన్ని అవమానంగా భావించి రామకృష్ణపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన అల్లుడు రామకృష్ణ గౌడ్‌ను చంపేందుకు లతీఫ్ అనే రౌడీ షీటర్‌ తో ఒప్పందం కుదుర్చుకుని.. కొంత సుపారీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. రామకృష్ణ గౌడ్ ఉద్యోగం లేకపోవడంతో స్థిరాస్తి వ్యాపారంలో మధ్యవర్తిగా ఉన్నాడు. అదే దారిలో వెళ్లి అతన్ని ట్రాప్ చేసి.. తమకు భూమి కావాలి అంటూ.. కొంతమంది చేత ఫోన్ చేయించారు. భూమిని చూపించడానికి హైదరాబాద్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు.

Honour Murder in Telangana: Ramakrishna Case in Telangana
Honour Murder in Telangana Ramakrishna Case in Telangana

పోలీసులకు ఈజీగానే..!

భర్త రామకృష్ణ బయటకు వెళ్లి ఎంతకూ తిరిగి రాకపోవడంతో భార్య భార్గవికి అనుమానం వచ్చింది. మొన్న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలో రామకృష్ణ గౌడ్ మృతదేహాన్ని గుర్తించారు. అతని ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా ట్రేస్ చేయడంతో రామకృష్ణ హత్యా ఉదంతం మొత్తం పోలీసులు కనిపెట్టారు. భార్గవి తండ్రి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు చెప్తున్నారు. రామకృష్ణని అత్యంత దారుణంగా ఓ స్తంభానికి కట్టేసి.. తలపై మేకులు కొట్టి హతమార్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసినట్టు సమాచారం. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దేశం మొత్తం మార్మోగుతుంది..!

author avatar
Srinivas Manem

Related posts

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju