‘డైనింగ్ టేబుల్’పై ఈ పాత్రలు వాడితే లావైపోతారట.. ఎందుకంటే?

డైనింగ్ టేబుల్ పై మనం వండిన వంటలను అక్కడికి పెట్టుకొని మనస్ఫూర్తిగా భోజనం చేస్తూ ఉంటారు. అయితే టేబుల్ మీద పెద్ద పెద్ద పాత్రలు ఉండకూడదని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ ఆ పాత్రాలు ఉంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారా? ఉంటే ఏం కాదండి… ఆ పాత్రల సైజులోకి మనం కూడా వెళ్తాం అంతే, ఈ మాటలు వినడానికి ఎంతో సరదాగా అనిపించినా, ఇది నిజం. పెద్ద పాత్రలకు, మనం బరువు పెరగడానికి చాలా దగ్గర సంబంధం ఉంది.

 

పెద్ద పరిమాణం ఉన్న ప్లేట్లలో భోజనం చేయడం వల్ల తినాల్సిన పరిమాణం కన్నా ఎక్కువగా తింటారు. దీని వల్ల అధిక బరువు పెరిగే ఊబకాయానికి దారితీస్తుంది. అదే చిన్నసైజు పాత్రలో తినడానికి కూడా మనం ఆలోచిస్తాము. తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో కేవలం పాత్రల పరిమాణం వల్ల ఎక్కువగా తింటున్నారాన్న విషయం పరిశోధనల్లో వెల్లడైంది. పాత్రల పరిమాణం తగ్గించడం వల్ల బ్రిటన్ లో 16 శాతం, అమెరికాలో 20% మంచి ప్రజలు ఊబకాయం సమస్య నుంచి కాపాడవచ్చని భావించారు.

కొంతమంది భోజన ప్రియులు ఇలాంటి పెద్ద పాత్రలు ఉండడం వల్ల ఎక్కువగా లాగించేస్తుంటారు. అలాంటి వారు బరువు పెరగడం వల్ల గుండె సమస్యలు, ఊబకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కానీ, అటువంటి వారిలో ఎలాంటి ఫలితం కనిపించదు. వీటన్నింటినీ కంట్రోల్ చేయాలి అంటే మనం చేయాల్సిన ముఖ్యమైన పని.. మన డైనింగ్ టేబుల్ పై గిన్నెల పరిమాణం చిన్నవిగా ఉండేలా చూడడం. కొద్దిమంది భోజనం చేసిన తరువాత ఎక్కువగా తీపి పానీయాలు తాగుతుంటారు, అలాంటి వారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు ఈ అలవాటును దూరం చేయడం వల్ల మన ఆరోగ్యం ఎంతో నిలకడగా ఉంటుంది.