NewsOrbit
Featured బిగ్ స్టోరీ

“కాపు”రం ఎవరితో…..? గోపురం ఎవరికీ..??

కులం లేనిదే రాజకీయం లేదు…! అందరూ గొగ్గోలు పెడుతున్నట్టు ఇప్పుడే ఈ కుల ప్రస్తావనలు, కుల రాజకీయాలు రాలేదు…!! రెండు తరాలకు మునుపే ఏపీలో తగలడ్డాయి. అయితే ఇప్పుడున్న మీడియా చైతన్యం కారణంగా నాటి కుల రాజకీయాల కంటే నేటివి పెద్దవిగా కనిపిస్తున్నాయి…!!

కాంగ్రెస్ దేశంలో పీక్స్ లో ఉన్నప్పుడు అంటే 1978 లోనే రెడ్డి కాంగ్రెస్ ఎందుకు పుట్టుకొచ్చింది..?? రెడ్డిలకు ఆధిపత్యం ఇవ్వడం లేదని కాసు బ్రహ్మానందరెడ్డి ఈ నిప్పు పెట్టలేదా..? మహానాయకుడిగా పేరున్న రాజశేఖర్ రెడ్డి ఆ కుల పార్టీలోకి వెళ్లలేదా, బయటకు రాలేదా..??
పచ్చిగా చెప్పుకోవాలంటే 1982 లో ఎన్టీఆర్ తెలుగు దేశం ఏర్పాటు వెనుక అసలు కారణాలు ఏంటి..?? కమ్మ గౌరవం కాదా…? కమ్మలను ఒక గొడుకు కిందకు తేలేదా..??
2009 లో చిరంజీవి ప్రజారాజ్యం ఎందుకు స్థాపించినట్టు..?? కాపులకు ఒక పార్టీ లేదు. భారీగా ఓట్లున్న కాపులు, తన అభిమానులు ఓట్లేసేస్తే కింగో.., కింగ్ మేకరో అయిపోదామని కాదా..??
సో… వీటన్నిటి ద్వారా చెప్పాలనుకున్నది ఏమిటంటే…!! మన రాష్ట్రంలో “కుల రాజకీయం” అనేది ఇప్పుడు మొదలయింది కాదు. ఇప్పట్లో అంతమయ్యేది కాదు. అందుకే కులానికో లీడర్ కావాలి. ఉంటేనే ఉనికి, పదవి, హోదా అన్నీ వస్తాయి.

 

ఏపీలో పెత్తనం రెడ్డి లేదా కమ్మ ఉంటుంది. రెడ్డికి జగన్ మోహన్ రెడ్డి అనే వీరుడొకరు ఉన్నారు. (అందరికీ ఆయన వీరుడు కాకపోవచ్చు. రెడ్డిలకు.., వారిలో 80 శాతం మందికి మాత్రం అతనే). కమ్మలకు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఒకటి ఉంది. (అందరికీ కాకపోవచ్చు కానీ, కమ్మలలో 70 శాతం బాబు వారికి బ్రాండ్). ఇక్కడ మరో కీలక పాయింటు ఉంది. రెడ్డి, లేదా కమ్మ ఆధిపత్యం సాగుతున్న ఈ రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ ఉన్నదీ మాత్రం బిసిలకు.., ఆ తర్వాత కాపులకు. (హమ్మయ్య…! ఏపీలో కాపుల ఓట్ల ప్రాధాన్యత చెప్పడానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. 1978 నుండి మొదలెట్టాల్సి వచ్చింది.) ఇక పాయింట్ కి వచ్చేద్దాం. కాపుల కొట్లాట చూసే ఉంటారు. పవన్ కొన్ని తిక్క మాటలు మాట్లాడితే.. వైసిపిలో ఉన్న కాపు నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో కాపుల్లో ఇలా గిల్లికజ్జాలు, కయ్యాలు లేవు.., ఉన్నా వేడి రగలలేదు. మరి ఇప్పుడూ కాపులందరి కాపురం ఎవరితో..? అనేదే ప్రశ్న.??

పవన్ తిక్క వదలవయ్యా సామీ…!!

అయ్యా పవనూ కళ్యానూ..!! నువ్వు సినిమాలకు ఎక్కువ.., రాజకీయాలకు తక్కువ…! మీ అన్న అనుభవం నుండి నువ్వు నేర్చుకున్నదేమిటి..?? నీ స్వీయ ఓటమి నుండి నువ్వు తెలుసుకున్నదేమిటి..?? గత ఎన్నికల్లో నీ వెంట నిలిచిన వాళ్లలో ఇప్పుడున్నదెవరు..?? నీలో నిలకడ లేమి… నిన్ను నిలువెత్తు దోషిగా నిలబెడుతుంది. రాజకీయ పామరుడిగా ప్రశ్నిస్తుంది. గత ఎన్నికల ముందు ఎవరికీ తెలియవు అనుకున్న నీ ఎన్నికల వ్యూహాలు నీకు గుర్తు చేస్తున్నాను నువ్వు మూడు వ్యూహాలతో వెళ్ళావు. మూడు బెడిసి కొట్టాయి…! * కాపుల ఓటింగ్ ఎక్కువ ఉన్న దగ్గర నాన్ కాపు వారికి టికెట్ ఇచ్చి.., ఈ అభ్యర్థి ఓట్లు, కాపు ఓట్లు కొల్లగొట్టేద్దాం అనుకున్నావ్.. (బెడిసికొట్టింది). * వైసిపి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వారి సామజిక వర్గానికి టికెట్ ఇచ్చి కెలికేద్దాం అనుకున్నావ్ (బెడిసికొట్టింది). * టిడిపి బలంగా ఉన్న చోట తుస్ మనిపించేలా పోటీ ఇచ్చావు..! అన్ని బెడిసికొట్టాయి. జగన్ అనే గాలిలో, ఊపులో, తుపానులో ఇవన్నీ బెడిసికొట్టాయి. కానీ ఇది నీకు అవకాశం. నీ 22 % ఓట్లున్న సామజిక వర్గానికి ఒక అవకాశం. పిచ్చి ఫాన్స్ ఉన్న నీకు ఓ అవకాశం. కానీ వెళ్లి రంగు పూసుకున్నావ్. ఉనికి కోసం, బలం కోసం తోకలేని బిజెపికి తోకలా మారావు.

 

మళ్ళీ అన్వేషణలో కాపులు…!!

ప్రస్తుతం కాపు నాయకుల్లో అధికశాతం జగన్ వెంట ఉంటె ఉండవచ్చు గాక. కానీ జగన్ ని కూడా వారు ఎక్కువగా నమ్మరు. కాపు అనే సామాజికవర్గానికి అందని ద్రాక్షగా ఉన్న కుర్చీ కోసం అందరూ కలిసేందుకు సిద్ధంగానే ఉన్నారు. చంద్రబాబు దగ్గర ఉన్న కొద్దీ మంది కావచ్చు.., జగన్ దగ్గర ఉన్న బలమైన నేతలు కావచ్చు.., పవన్ వెంట ఉన్న వ్యాపార కాపులు కావచ్చు… ఒక సరైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అది బీజేపీ గా చూపించి.., అందరిని కలుపుకుని వెళ్లి.., కాపు బీజేపీ గా మార్చేసి.., వచ్చే ఎన్నికల నాటికి కమ్మ – కాపు కలిసే జంటగా మార్చేసే ఆలోచనలు కొందరిలో ఉంటె ఉండొచ్చు. అది అందాలి అంటే.. సాధించాలి అంటే ఒక “లీడర్” కావాలి. కాపులను మళ్ళీ గాడిలో పెట్టగల రంగా లాంటి లీడర్ కావాలి. అలా ఉంటేనే జగన్ ని దించగలరు. బాబుని ముంచగలరు. అప్పటి వరకు కాపుల్లో కాపులకు ఈ కయ్యాలు తప్పవు.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju