Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులకు మరింత చేరువ అయింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.నిరూపమ్ జ్వలకు ఫోన్ చేసి ఒకసారి కలవాలి అని. చెప్పడంతో జ్వాల తెగ సంబరపడిపోతుంది. నిరూపమ్ ని కలుసుకోవడానికి జ్వాల ఆటోలో బయలుదేరి వెళ్తుండంగా మధ్యలో డీజిల్ అయిపోతుంది. దాంతో జ్వాల చిరాకు పడుతూ అయ్యో ఏంటి ఇలా అయింది అని అనుకుంటుంది.
ఈ లోపు అటుగా సౌందర్య కారు వస్తుంది. ఇక జ్వాల సౌందర్యను హెల్ప్ అడుగుతుంది. కానీ సౌందర్య సరే అని చెప్పి తన కారులోని డీజిల్ ఇస్తుంది. ఇక డీజిల్ తీసుకుంటున్న క్రమంలో జ్వాల సౌందర్యను నానమ్మ నేను అర్జెంట్ పని మీద వెళుతున్నాను కాబట్టి నిన్ను ఫాలో చేయలేకపోతున్నాను. లేదంటే నిన్ను ఫాలో అయ్యి హిమ గురించి తెలుసుకుని ఉండేదాన్ని అని అనుకుంటుంది మనసులో ఎప్పుడు నిన్ను ఫాలో అవుదాం అనుకున్నా ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంటుంది అని అనుకుంటుంది. ఇక డాక్టర్ సాబ్ తరువాతనే ఎవరు అయినా అనుకుని ఆయనే నా ప్రపంచం అని నిరూపమ్ ను తలుచుకుంటుంది
సీన్ కట్ చేస్తే స్వప్న బాగా తలనొప్పిగా, నీరసంగా ఉంది అని తూలి పోతూ ఉన్న సమయంలో అక్కడకు సౌందర్య వచ్చి స్వప్నను పట్టుకుంటుంది. కానీ స్వప్న మాత్రం సౌందర్యపై చిరాకు పడుతుంది.ఇక మన సౌందర్య తనదైన స్టయిల్ లో స్వప్నను పెద్దగా కసురుకుని బెడ్ పై పడుకోబెట్టి తన చేతులతో స్వయంగా స్వప్నకు మంచి నీళ్లు తాగిస్తుంది.ఇక రెస్టారెంట్ నిరూపమ్. కంటే ముందుగా వెళ్లిన సౌర్య డాక్టర్ బాబు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ బాబు నాకు ఏ విధంగా ప్రపోజ్ చేస్తాడు అని తెగ ఆలోచిస్తూ మురిసిపోతు ఉంటుంది. ఈలోపు అక్కడకు నిరూపమ్ వచ్చి కూర్చుంటాడు. జ్వాల మాత్రం నిరూపమ్ ను చూసి ఒక రేంజిలో ఊహల్లోకి వెళ్ళిపోతుంది.
మరోవైపు కళ్ళు తిరిగి పడిపోయిన స్వప్నను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటుంది సౌందర్య.ఇంతలో అక్కడకు హిమ వస్తుంది.. హిమను చుసిన స్వప్న కోపంతో ఇంట్లో డాక్టర్ లేడా?ఏంటి…వైద్యం కోసం మీ మనవరాలినే పిలిపించాలా అని సౌందర్యపై మండిపడుతుంది.ఇక హిమ ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా స్వప్న ఆరోగ్య పరిస్థితి ని పరిశీలిస్తుంది.
మరో వైపు నిరూపమ్ కాస్త తట పటాయిస్తూ నాకు ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు జ్వాల అంటాడు.కానీ ఈ లోపు జ్వాల నేనే మీకు ముందుగా ఒకటి చెప్పాలనుకున్నాను డాక్టర్ సాబ్ అంటుంది. ఇక నిరూపమ్ ముందు నువ్వే చెప్పు పర్వాలేదు అని అంటాడు. జ్వాల మనసులోని మాట చెబుతుండగా ఈ లోపు అక్కడకు ఎవరో అనుకోకుండా రావడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…