karthika Deepam: హిమను పెళ్లి చేసుకున్న నిరూపమ్…. షాక్ లో స్వప్న, జ్వలలు..!

Share

karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందామా.. నిరుపమ్ హిమని ప్రేమిస్తున్న విషయం జ్వాలకు చెప్పడానికే కాఫీ కేఫ్‌ కి రమ్మనడంతో ఇద్దరు కూడా అక్కడ మీట్ అవుతారు. అయితే నిరుపమ్ ఫోన్ చార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అవ్వడంతో అక్కడ ఎర్రచొక్కా వెయిటర్‌కి చార్జింగ్ పెట్టమని ఫోన్ ఇస్తుంది జ్వాల. ఇక నిరూపమ్ జ్వల నీకో విషయం చెప్పాలి అంటే డాక్టర్ సాబ్ నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి అంటుంది. సరే నువ్వే చెప్పు ముందు అంటే జ్వల చెప్పబోయే సమయానికి ఎవరో వస్తారు.

karthika deepam may 05 today episode

karthika Deepam: స్వప్నను. బిపి తగ్గించుకో అని సలహా ఇచ్చిన హిమ

సీన్ కట్ చేస్తే స్వప్న కళ్ళు తిరిగి పడిపోవడంతో సౌందర్య హిమకి కాల్ చేస్తుంది. ఇక హిమ స్వప్న చేయి పట్టుకుని పల్స్ చెక్ చేస్తుంది.బీపీ చూస్తుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో.. ‘అత్తయ్యా ప్లీజ్.. ఎందుకో తెలియదు మీరు చాలా కోపంగా ఉన్నారు.బీపీ పెరిగిపోతుంది మీకు కొంచెం శాంతంగా ఉండండి అంటుంది హిమ స్పప్నతో..కోపం తెప్పించే వాళ్ళు కళ్ళ ముందే ఉంటే ఇంకా నాకు కోపం రాక ఏమవుతుంది అంటుంది. అయినా నీ చేత నేను వైద్యం చేయించుకోవాలా..? నా కొడుకు వస్తాడులే అంటుంది స్వప్న కోపంగా.ఇక సౌందర్య మాత్రం హిమ చాలా మారింది. ఇప్పుడు ఆపరేషన్స్ కూడా చేస్తుంది. ఈ మార్పుకి కారణం ఆ ఆటో అమ్మాయి జ్వాలే’ అంటుంది దాంతో స్వప్నకు బీపీ మరింతగా పెరిగిపోతుంది. ‘నా ప్రాణానికి ఈ ముగ్గురు ఎక్కడ తగిలారే అంటుంది. అయినా ఈ టైమ్‌లో నిరుపమ్ ఎక్కడికి పోయినట్లు.. నా కర్మ కాకపోతే’ అని మనసులో తిట్టుకుంటుంది స్వప్న. కొన్ని మందులు రాసి సౌందర్యకు ఇచ్చి వెళ్ళిపోతుంది.

karthika deepam may 05 today episode

karthika Deepam: హిమను ప్రేమిస్తున్న విషయం నిరూపమ్ జ్వాలకు చెబుతాడా..?

సీన్ కట్ చేస్తే.. నిరుపమ్ జ్వాలతో కాఫీ కేఫ్ దగ్గర ‘నీకు మాత్రమే ఈ విషయం చెప్పగలను జ్వాల నీవల్లనే ఈ పని అవుతుంది అందుకే నిన్ను ఎంచుకున్నాను’ అంటూ సిగ్గు పడుతూ హిమ ప్రేమ విషయం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అయితే జ్వాల తనకే ప్రపోజ్ చేయబోతున్నాడని అర్థం చేసుకుంటుంది. ‘డాక్టర్ సాబ్ మీలానే నేను మీతో ఒక విషయం చెప్పాలని అనుకున్నాను..’ అంటుంది. దాంతో నిరుపమ్ ‘అయితే ముందు నువ్వే చెప్పు జ్వాలా’ అంటాడు. డాక్టర్ సాబ్ నేను అంటూ నసుగుతూ విషయం చెప్పబోయేలోపు.. జ్వాల ఎదురుగా ఉన్న టీ కప్పుని తీసుకుని ప్రేమ్ తాగుతాడు. గతంలో జరిగిన సీన్ గుర్తు చేసుకుంటుంది జ్వాల.ప్రేమ్ చేసిన పనికి నిరుపమ్, జ్వాల ఇద్దరూ మనసులో నిరాశపడతారు. ఇంతలో ఎర్రచొక్కా వెయిటర్ చార్జింగ్ పెట్టిన నిరుపమ్ ఫోన్ తెచ్చి.. ‘సార్ మీకు చాలా ఫోన్లు వచ్చినట్లు ఉన్నాయి’ అని ఇవ్వడంతో నిరుపమ్.. తన ఫోన్ చూసుకుని, క్షణాల్లో బై చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

karthika deepam may 05 today episode

హిమను పెళ్లి చేసుకున్న నిరూపమ్

ఇక స్వప్న హాల్లో కూర్చుంటుంది. పక్కనే హిమ, సౌందర్య కూడా కూర్చుంటారు.‘అత్తయ్యా ఏం ఆలోచించొద్దు అత్తయ్యా.. మీరు కాస్త కూల్‌గా ఉంటేనే మీకు బీపీ తగ్గి నార్మల్ అవుతారు’ అంటుంది హిమ.ఇక స్వప్న మాత్రం నిరుపమ్, హిమ పెళ్లి చేసుకుని వచ్చినట్లు ఊహొస్తుంది. గుమ్మం ముందు నిరుపమ్, హిమలు పెళ్లి బట్టల్లో, మెడలో దండలు వేసుకుని కనిపిస్తారు.వెంటనే స్వప్న తిరుకొని ఛీ ఇలా ఉహించుకున్న ఏంటి అంటుంది. నిరుపమ్ ఎక్కడా?’ అనుకునే లోపే నిరుపమ్ ఎదురుగా వస్తాడు.

karthika deepam may 05 today episode

బిర్యానీ తెచ్చిన జ్వల అసలు విషయం ఏంటంటే..?

ఇక సీన్ కట్ చేస్తే.. సత్య ప్రేమ్‌తో రేయ్ మీ అమ్మకి ఎలా ఉందటరా? కళ్లు తిరిగి పడిపోయిందటగా’ అంటాడు.బాగానే ఉంది డాడీ అంటాడు.అయినా మీరు ఇద్దరు మారరు. ఎవరి దారి వారిది అన్నట్టు ఉంటారు అంటాడు.ఇంతలో జ్వాల భోజనం తీసుకుని వస్తుంది. మళ్లీ ఎప్పటిలానే గొడవ పడతారు ప్రేమ్, జ్వాల. అయితే జ్వల తెచ్చింది బిర్యానీ అని తెలిసి ప్రేమ్ నిరుపమ్‌కి కాల్ చేసి ‘రేయ్ నీ రౌడీ బేబీ.. బిర్యానీ తెచ్చిందిరా.. నీకు ఇష్టం కదా.. వచ్చేయ్ ఇక్కడ తిందాం’ అంటాడు. వెంటనే నిరుపమ్.. ‘అయితే హిమకు కూడా కాల్ చేసి రమ్మనరా’ అంటాడు. ప్రేమ్ కూడా హిమకు కాల్ చేసి రమ్మని అంటాడు.. హిమ ప్రేమ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే నీ తిక్క.. అదే ఆ జ్వాల బిర్యానీ తెచ్చింది.. ఇంటికి రా హిమా.. తిందువుగానీ’ అని పిలవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

53 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

6 hours ago