NewsOrbit
Featured న్యూస్ సినిమా

Karthika Deepam: ప్రేమ్ ప్రేమకు అడ్డుపడిన జ్వాల…. జ్వాల ప్రేమను కాదన్నా నిరూపమ్… ఇంతకీ హిమ మనసులో ఎవరు ఉన్నారు..?

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.మరి ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక దీపం సీరియల్లో ఎలాంటి మలుపులు చోటుచేసుకొన్నాయో చూద్దామా.. సీరియల్ ప్రారంభంలోనే హిమ, ప్రేమ్ లు కాఫీ కోసం ఒక హోటల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రేమ్ ఎలాగయినా ఈరోజు తన మనసులో మాట హిమకు చెప్పాలని హార్ట్ షేప్ లో ఉండే కాఫీని ప్రిపేర్ చేపించి తన ప్రేమను హిమకు చెప్పాలి అనుకుంటాడు.

karthika deepam today 25 april episode
karthika deepam today 25 april episode

ప్రేమ్ హార్ట్ ను లాక్కున్న జ్వాల

ఈలోపు అక్కడకు అనుకోకుండా జ్వాల వస్తుంది.వాళ్ళను అక్కడ చూసి వాళ్ళ దగ్గరకి వెళ్లి ప్రేమ్ హిమ కోసం ఆర్డర్ చేసిన కాఫీని టక్కున తీసుకుని జ్వాల తాగుతుంది. దాంతో ప్రేమ్ తన పై ఒక రేంజ్ లో చిరాకు పడతాడు.ఏమి స్పెషల్ కాఫీనా.. నేను ఇస్తాలే డబ్బులు అంటూ ప్రేమ్ ను అటపట్టిస్తుంది..మరోవైపు నిరూపమ్ మాత్రం హిమ ఫోటోను చూస్తూ మన విషయం మమ్మీ వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అనుకుంటాడు.ఇక ఆ తర్వాత అక్కడకు హిమ వస్తుంది. రావడంతోనే అక్కడ ఉన్న ఒక పేషెంట్ కి భయపడకుండా ఇంజక్షన్ చేస్తుంది.అది చూసి నిరూపమ్ నీలో ఇంత మార్పా అంటూ ఆనంద పడుతూ ఉంటాడు. దాంతో హిమ నన్ను జ్వాలకు అప్పగించారు కదా తన ట్రైనింగ్ ఇదంతా అని అంటుంది.

karthika deepam today 25 april episode
karthika deepam today 25 april episode

నిరూపమ్ ను భర్తగా ఉహించుకుంటున్న జ్వాల

జ్వాల మాత్రం నిరూపమ్ ను తలుచుకుని ఆనందంలో ఉంటుంది.నేను ఫిక్స్ అయ్యాను నువ్వే నా మొగుడివి..  నువ్వే నా లోకం డాక్టర్ సాబ్ అని మనసులో అనుకుంటుంది.ఇక స్వప్న రోడ్డు మీద కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే జ్వల ఆటో ముందు వెళ్తుంది. ఎంత హారన్ కొట్టిన ఆటోను పక్కకు పోనివ్వదు. అయితే ఆటో జ్వాలది అని స్వప్నకు తెలియదు. ఆటో వెనకాల రాసి ఉన్నా వదిలేదేలే అని ఉన్నా కొటేషన్ చదివి ఏంటో ఇలా రాసుకున్నారు అనుకుంటుంది

karthika deepam today 25 april episode
karthika deepam today 25 april episode

హిమను ఎత్తుకున్న నిరూపమ్

ఇక ఒక చోట నిరూపమ్, హిమ,జ్వల కలిసి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లను చూసిన స్వప్న ఆ హిమని నిరూపమ్ కు దూరం చేయాలని చూస్తుంటే మధ్యలో ఈ ఆటో పిల్ల తగులుకుంది ఏంటి అని మనసులో కోపంతో రగిలిపోతుంది. తరువాత చెప్తా వీళ్ళ పని అని అక్కడనుండి వెళ్ళిపోతుంది. ఇక ఒక తోటలో పిల్లలు మామిడికాయలు కోస్తుంటే వాళ్ళ దగ్గరకు వెళ్లి నేను కోసిస్తాను అంటుంది. ఇక హిమ మామిడికాయ కోయడానికి కష్ట పడుతూ ఉంటుంది. ఈలోపు నిరూపమ్ వచ్చి తనను ఎత్తుకొని ఆ మామిడికాయ కోపిస్తాడు. వాళ్లిద్దరూ కాసేపు ఒకరిని ఒకరు ప్రేమతో చూసుకుంటూ ఉండగా ఎపిసోడ్ పూర్తవుతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju