Karthika Deepam Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందామా.. మోనిత ఇంటికి వెళ్లిన జ్వాల అక్కడ సెల్ ఫోన్ మర్చిపోతుంది. అంతలో ఆనంద్ అక్కడికి రావడంతో ఆనంద్ ను మోనిత ఇంట్లో సెల్ఫోన్ మర్చిపోయాను గాని వెళ్లి ఫోన్ తీసుకునిరా అని చెప్పి మోనిత ఇంటికి పంపిస్తుంది. అయితే ఆనంద్ లోపలికి వెళ్ళే లోపే సెల్ ఫోన్ నా దగ్గరే ఉంది అని చెప్పి వెనక్కి పిలుస్తుంది.
అమ్మను ఫోటో ఎగ్జిబిషన్ కు తీసుకువచ్చిన నిరూపమ్ :
మరోవైపు నిరూపమ్ వాళ్ళ అమ్మ కలసి ప్రేమ్ పెట్టిన ఫోటో ఎగ్జిబిషన్ కి బయలుదేరుతారు.వస్తున్నాము అని ముందిగానే ప్రేమ్ కు ఫోన్ చేసి చెబుతాడు సీన్ కట్ చేస్తే హిమ జ్వాలకు ఫోన్ చేయడంతో చెప్పు తింగరి అంటుంది జ్వాల. ఆ పిలుపు విన్న హిమ నువ్వు నన్ను తింగరి అని పిలుస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది. జ్వాల కూడా నీలో మార్పు మొదలయింది అని అనుకుంటుంది మనసులో.ఇక ఎగ్జిబిషన్ కు వస్తారు నిరూపమ్, స్వప్న.. వాళ్ళను చూసి ప్రేమ్ వెళ్లి పలకరిస్తాడు. ఈ ఫొటోస్ ఇవన్నీ ఎందుకురా నీకు నా దగ్గరే నువ్వు కూడా పెరిగి ఉంటే నిరూపమ్ లాగా గొప్పవాడివి అయ్యేవాడివి కదా అంటుంది. ఇంతలో నిరూపమ్ ఏదో చెప్పి స్వప్నను కంట్రోల్ చేస్తాడు.ఈ క్రమంలోనే ప్రేమ్ డాడీ వస్తే ఇంకా బాగుండేది అంటాడు ఆ మాట విన్న స్వప్న కోపం వ్యక్తం చేస్తుంది. అందరు కలిసి లోపలికి వెళ్తారు.
చీరలో హిమను చూసి షాక్ అయిన ప్రేమ్, నిరూపమ్ :
ఇంతలో ఆ ఎగ్జిబిషన్ కి హిమ చక్కగా చీర కట్టుకుని ఫ్లవర్ బొకే పట్టుకుని వస్తుంది. హిమను చూసి ప్రేమ్, నిరూపమ్ ఇద్దరు ఆనందపడతారు. హిమను చూసిన స్వప్న ఒరేయ్ దీని ఎందుకు పిలిచావు అని ప్రేమ్ పై చిరాకు పడుతుంది. అంతేకాకుండా ఎగ్జిబిషన్ కి ఇంతలా రెడీ అయ్యి రావాలా అని హిమను వెటకారంగా అంటుంది. ఇక ముస్తాబైతే మీ బావకి దగ్గర అవుదామన అని అంటుంది. దాంతో హిమ ఎంతో ఫీల్ అవుతుంది.ఇక నిరూపమ్ వచ్చి మమ్మీ ఇక్కడ ఎందుకు అనవసరంగా లేనిపోని గోల అని స్వప్న ను కూల్. చేస్తాడు.మరోవైపు ప్రేమ్…హిమను తలుచుకుంటూ కలలు కంటూ ఉంటాడు.
సత్యను ఎక్సబిషన్ కు తీసుకుని వచ్చిన జ్వాల :
ఇక జ్వాల తన ఆటోలో సత్యం సార్ ను ఎక్కించుకుని వస్తుంది. అయితే జ్వాల ఆటోను డైరెక్ట్ గా ఎగ్జిబిషన్ ఉన్న దగ్గరకు తీసుకుని వస్తుంది.ఇక సత్య మాత్రం ఏంటి జ్వాల ఇక్కడికి ఎందుకు తీసుకు వచ్చావు అడుగుతాడు. నేను వస్తే పెద్ద గోల జరుగుతుంది వద్దు అంటాడు.ఇక జ్వాల ఎదో విధంగా నచ్చ చెప్పి లోపలికి తీసుకొని వెళుతుంది.ఇక ఎగ్జిబిషన్ కి వచ్చిన సత్యను చూసి స్వప్న షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది.డాడీనీ చూసి ప్రేమ్, నిరూపమ్ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. హిమ కూడా మరింత ఆనందంగా ఫీల్ అవుతుంది.. స్వప్న మాత్రంచిరాకు పడుతుంది.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.