NewsOrbit
Featured

Karthika Deepam: ప్రేమ పేరుతో మళ్ళీ జ్వాలకు అన్యాయం చేసిన హిమ.. బాధలో జ్వల..ప్రేమ మైకంలో హిమ., నిరూపమ్ లు..!!

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో సౌందర్య అందరికి సర్ప్రైజ్ అంటూ హిమ, నిరుపమ్‌ల పెళ్లి ప్రకటన చేస్తుంది. మరో పక్క ఫంక్షన్ కు బయలుదేరిన జ్వాల దొంగనోట్ల కేసులో పోలీసులకు పట్టుబడడంతో ఫంక్షన్‌కి రాలేకపోతుంది.మరో పక్క ఈ పెళ్లి జరగదని స్వప్న, జరుగుతుంది అని సౌందర్య ఒకరితో ఒకరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఈరోజు ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక జ్వాల పోలీస్ స్టేషన్‌లో తన తప్పు ఏం లేదు అని నిరూపించుకుని ఫంక్షన్‌కి బయలుదేరుతుంది. అప్పటికే చాలా లేట్ అవుతుంది. ఎలాగోలా ఆటోలో బయలుదేరి టెన్షన్ పడుతూ ఫంక్షన్ హాల్ కి వెళ్లే సమయానికి అక్కడ ఎవరు ఉండరు. ఇక జ్వాల మనసులో పాపం డాక్టర్ సాబ్.. నా కోసం వెయిట్ చేశాడో ఏమో..? అయినా డాక్టర్ సాబ్ నాకు తన మనసులో మాట చెబుతానని కూడా అన్నారు.. మిస్ అయ్యాను అనుకుని బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

Read the latest news from NEWSORBIT
Follow us on facebook , Twitter , instagram and Googlenews

Karthika Deepam: ఒక్కటయిన హిమ, నిరూపమ్ లు :

సీన్ కట్ చేస్తే అమ్మమ్మ చేసిన పెళ్లి ప్రకటనతో హిమ, నిరుపమ్‌లు ఇద్దరు కూడా మనసులో ఎంతో సంతోషపడుతూ ఉంటారు. ఇక వీళ్ళద్దరు ఇంటి బయట నిలబడిన హిమ నిరూపమ్ ను చూసి కాస్త సిగ్గుబడుతూ ఉంటుంది.ఇక నిరూపమ్ ‘హిమా.. నిజానికి అమ్మమ్మ గొప్ప సాయం చేసింది నాకు.. మనం చిన్నప్పటి నుంచి కలిసి స్నేహంతో పెరిగినా నువ్వంటే నాకు చాలా ఇష్టం హిమ కానీ నీకు ఐ లవ్యూ చెప్పడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను తెలుసా? చివరికి జ్వాల సాయం కూడా తీసుకోవాలని అనుకున్నాను..అదృష్టం బాగుండి ఇలా కుదిరింది’ అంటూ నవ్వుతూ హిమ చేతుల్ని పట్టుకుంటాడు నిరుపమ్.హిమ కూడా నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం బావ.కానీ నీకు చెప్పలేకపోయాను.నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటుంది.
Read the latest news from NEWSORBIT
Follow us on facebook , Twitter , instagram and Googlenews

Read the latest news from NEWSORBIT
Follow us on facebook , Twitter , instagram and Googlenews
సౌర్య వస్తేనే పెళ్లి అంటూ తేల్చి చెప్పేసిన హిమ :

ఇంతలో సౌందర్య అక్కడకు రావడంతో ఇద్దరు కూడా చేతులు వదిలేస్తారు.ఏంటి ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉన్నారు అంటుంది సౌందర్య.అప్పుడే హిమ కాస్త ఎమోషనల్‌గా.. ‘నాన్నమ్మా.. నా జీవితంలో సగం సంతోషం సౌర్య తను లేకుండా పెళ్లి ఏంటి నాన్నమ్మా.. సౌర్య నా జీవితంలో ఉండాలి అని హిమ అంటుంది. ఇంతలో సౌందర్య.. ‘హిమా నువ్వు అన్నట్లే సౌర్య దొరికాకే మీ పెళ్లి జరుగుతుంది. కాని రేపు మాత్రం మీ నిశ్చితార్థం జరగాల్సిందే’ అంటుంది సౌందర్య.

Read the latest news from NEWSORBIT
Follow us on facebook , Twitter , instagram and Googlenews

ఆనందంలో సత్య… బాధలో ప్రేమ్ :

ఇక సత్య నిరూపమ్., హిమల పెళ్లి తలుచుకుని ఆనందంగా గ్లాసులో మందు పోసుకుంటాడు.అదే విషయం పక్కనే బాధగా కూర్చున్న ప్రేమ్‌తో చెబుతాడు. అయితే ప్రేమ్‌ మాత్రం చాలా బాధ పడుతూ ఉంటాడు. తన మనసులో బాధను తండ్రికి చెప్పుకోవాలని అనుకుంటాడు కానీ తండ్రి ఆనందాన్ని పాడుచేయడం ఇష్టం లేక అక్కడ నుంచి బాధతో వెళ్లిపోతాడు.ఇక స్వప్న చిందులు తొక్కుతూ ఇంటికి వెళ్లి జరిగింది గుర్తు చేసుకుంటూ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు పగలకొడుతూ ఉంటుంది. అప్పుడే సౌందర్య వెళ్లడంతో ఎప్పటిలానే ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది.

జరిగిన విషయం తెలియక డాక్టర్ సాబ్ ఊహల్లో జ్వాల :

పాపం జ్వాల మాత్రం జరిగిన విషయం తెలియక తన ఫోన్‌లో నిరుపమ్‌తో కలిసి దిగిన ఫొటోస్ చూసుకుంటూ మురిసిపోతుంది. ఇంతలో హిమ అక్కడకు వచ్చి హాయ్ జ్వాల మనం.షాపింగ్‌కి వెళ్లాలి రా అంటుంది కానీ జ్వాల మాత్రం నువ్వు వెళ్లు తింగరీ నాకు ఈ షాపింగ్స్ అవీ పడవు’ అంటుంది. అవునా సరే అయితే మీ డాక్టర్ సాబ్‌కి నువ్వు రాను అన్నావని చెబుతాను అంటుంది. అయినా ఈ షాపింగ్‌కి, డాక్టర్ సాబ్‌కి సంబంధం ఏంటి అని జ్వాల అడుగుతుంది. దాంతో హిమ అసలు ఈ షాపింగ్ చేయమని చెప్పిందే మీ డాక్టర్ సాబ్ కదా..’ అంటుంది. ఆ మాట విన్న వెంటనే సరే పదా నేను వస్తాను అని బయలుదేరడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Karthika Deepam: ముక్కలయిన ప్రేమ్ మనసు… నిరూపమ్, హిమల పెళ్లి విషయంలో తగ్గేదేలే అంటున్న తల్లి కూతుళ్లు..!!

Deepak Rajula

Karthika Deepam: స్వప్న ఇగోను రెచ్చగొట్టిన జ్వల… తింగరే హిమ అని తెలుసుకోనున్న జ్వల..!

Deepak Rajula

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఎనర్జీ టానిక్ లా పనిచేస్తున్న ఓ అజ్ఞాత అభిమాని లేఖ!నెట్టింట ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్!

Yandamuri

karthika Deepam: హిమను పెళ్లి చేసుకున్న నిరూపమ్…. షాక్ లో స్వప్న, జ్వలలు..!

Deepak Rajula

Karthika Deepam: జ్వాల తన మనసులోని మాటను నిరూపమ్ కు చెప్పేస్తుందా..? మరి నిరూపమ్ రియాక్షన్ ఏంటో..?

Deepak Rajula