NewsOrbit
Featured బిగ్ స్టోరీ

వైజాగ్ కేపిటల్ మోదీ గ్రీన్ సిగ్నల్…(న్యూస్ ఆర్బిట్ ఎక్స్‎క్లూజివ్)

చెప్పకనే చెప్పిన కేంద్రం

రాష్ట్రప్రభుత్వాల హక్కులను కాలరాయం… వారికి నచ్చినట్టు చేసుకోవచ్చు. రాష్ట్రాల మంచి నిర్ణయాల్లో తప్పక మద్దతు ఉంటుంది. అది మా పార్టీయా… మరో పార్టీయా అన్నది చూడం… ఇది గత ఆరేళ్లుగా ప్రధాన నరేంద్ర మోదీ వివిధ సందర్భాల్లో చెబుతోంది. అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ వైజాగ్ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే కేంద్రం రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోనిదని… ఆ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ హైకోర్టు సాక్షిగా క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు కోర్టు ఏం చెబుతుంది.. రాజధాని ముహూర్తం 16న జరిగిపోతుందా… అన్న ఉత్కంఠ నడుము… జగన్ సర్కారు రాజధాని మార్పుకు రంగం సిద్ధం చేసేసుకుంటోంది.

JAGAN WISHES MODI FILE PHOTO
JAGAN WISHES MODI FILE PHOTO

నాడు పవిత్ర నదీ జలాలు, మట్టి ఇచ్చిన మోదీ

రాజధాని కదిలించే శక్తి ఎవరికీ లేదని టీడీపీ, కొందరు బీజేపీ నేతలు ఘంటాపథంగా చెబుతూ వచ్చారు. న్యాయపరంగా పోరాటం సాగిస్తున్నారు. ఇప్పటికే రాజధానుల అంశం కోర్టు పరిశీలనలోనే ఉంది. అయితే సీఎం జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. ఎక్కడా అమరావతి రాజధాని వ్యవహారంలో కాంట్రవర్శీకి తావివ్వకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. నాడు చంద్రబాబు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తే పవిత్ర నదుల జాలలను, పార్లమెంట్ ప్రాంగణంలోని మట్టిని కానుకగా తెచ్చి గొప్ప కార్యక్రమంగా చెప్పిన మోదీ… రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రతి మేలు చేస్తామని… అందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆ తర్వాత టీడీపీకి, బీజేపీకి చెడటం… చంద్రబాబునాయుడు నేరుగా ప్రధాని మోదీతో తలపడటం… 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలవడం… జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో… సహజంగా వైసీపీ సర్కారుపై బీజేపీ సాఫ్ట్ కార్నర్ చూపించింది.

PM Modi brings soil and water from Delhi for Andhra Pradesh capital
PM Modi brings soil and water from Delhi for Andhra Pradesh capital

జగన్‎పై సాఫ్ట్ కార్నర్

అదే సమయంలో స్థానిక బీజేపీ ఒక రకమైన అప్రోచ్ తో వెళ్తే… జాతీయ స్థాయిలో మాత్రం బీజేపీ పెద్దలు వైసీపీకి అగ్రతాంబూలమే అందించారు. పైపెచ్చు ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంత సాఫ్ట్ కార్నర్‎తో ఉంటే బీజేపీ అంతగా జగన్ సర్కారుకు చేయూతను అందించేందుకు సిద్ధమైనట్టు కూడా వార్తలు వచ్చాయ్. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఇరుకునపెట్టే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కేసీఆర్‎తో స్నేహ హస్తమున్నప్పటికీ అది ఎక్కడా బీజేపీని దూరం చేసే అంతగా లేకపోవడం, అదే సమయంలో మిగతా ముఖ్యమంత్రులకు భిన్నంగా వ్యవహరిస్తూ జగన్ సాగిస్తున్న పాలన ఒక రకంగా నాన్ కాంట్రవర్షియల్ గానే సాగుతోంది.

MODI SOFT CORNER TOWARDS JAGAN?
MODI SOFT CORNER TOWARDS JAGAN

విశాఖ సాక్షిగా మోదీ మద్దతు

కానీ… మూడు రాజధానుల విషయంలో ఎన్నో అనుమానాలు… మరెన్నో సంకటాలు జగన్ సర్కారు ముందు నిలిచాయ్. ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరో సర్కారు ఎందుకు నెరవేర్చదన్న ప్రశ్నలకు… తాము అమరావతి రాజధానిని మార్చడంలేదని… ఇంకో రెండు ప్రత్యేక రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తున్నా… మా బతుకులెలా అంటూ సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ… వైజాగ్ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమంటే జగన్ సర్కారుకు వెయ్యి ఏనుగల బలాన్నివ్వడమే. బీజేపీ ప్రాధమిక సిద్ధాంతం అభివృద్ధి వికేంద్రీకరణకు ఆ పార్టీ అడ్డు చెప్పదు. సో మోదీ కూడా జగన్ సర్కారుకు బాసటగా నిలిచే అవకాశం స్పష్టం… అందుకే 16న అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి మోదీ సాక్షిగా నిలుస్తారు. వైజాగ్ వచ్చి శంకుస్థాపనలో పాల్గొంటారా… లేదా ఆన్‎లైన్‎లో అభినందనలు చెబుతారా… లేదంటే ఒక వీడియో సందేశం ద్వారా తన ఉద్దేశాన్ని చెబుతారా అన్నది తేలాలంటే 16 వరకు ముందు నుంచి చెబుతున్న బీజేపీ నేతలు

SOMU VEERAJU, VISHNU VARDHAN REDDY
SOMU VEERAJU VISHNU VARDHAN REDDY

రాష్ట్ర నిర్ణయాల్లో కేంద్రం జోక్యం ఉండదు

బీజేపీ నేతలు కొందరు అమరావతికి మద్దతిస్తూ మాట్లాడుతున్నప్పటికీ… సోము వీర్రాజు, జీవీఎల్, సునీల్ దియోధర్, విష్ణువర్థన్ లాంటి నేతలు… రాజధానిపై క్లారిటీ ఇస్తూనే వచ్చారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్లో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని వారు తెగేసి చెప్పారు. బీజేపీ ముఖ్యనేత విష్ణువర్థన్ రెడ్డి ఇదే అంశాన్ని మీడియా చర్చల్లో చాలా గట్టిగా చెప్పారు. పార్టీ వేరు… ప్రభుత్వం వేరని… రెండు విషయాలను అర్థం చేసుకోవాలని చెబుతూ వచ్చారు. మొత్తంగా బీజేపీ ఏపీలో ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు కన్పిస్తోంది. రాజధాని తరలింపు వ్యవహారం ఏపీ హైకోర్టులో 14వ తేదీ వరకు స్టేటస్ కో ఉంది. ఐతే దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 14వ తేదీ సాయంత్రం లోపు ఇటు సుప్రీం కోర్టు లేదంటే హైకోర్టులో స్టేటస్ కో ఎత్తేస్తే 16న వైజాగ్ కేపిటల్ శంకుస్థాపన కార్యక్రమం యధాతథంగా జరుగుతుంది.

author avatar
DEVELOPING STORY

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju