కరోనా అనే వైరస్ ఇండియాకు వరకు చికిత్సకు మందే లేదు అనుకున్నాం…! కానీ హైడ్రో క్లోలోక్విన్ అనే మందు ఉపయోగపడుతుందని ప్రపంచం గుర్తించింది. అన్ని దేశాలకు మన దేశం సరఫరా చేసింది…!
మొన్నటి వరకు అసలు కరోనాకు మందులే లేవు అనుకున్నాం…! కానీ అనూహ్యంగా గ్లెన్మార్క్ వారి నుండి ఫెబి ఫ్లూ వచ్చేసింది…! ఆ తర్వాత రోజునే హెటేరో డ్రగ్స్ వాళ్ళు ఒక ఇంజక్షన్ విడుదల చేసేసారు…!
ఇక నిన్నటి వరకు కరోనాకు వాక్సిన్ వచ్చే ఏడాది వస్తుందేమో అనుకున్నాం..! కానీ భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసేసింది.., బారతీయ మెడికల్ కౌన్సిల్ ఆమోదించేసి, అర్జంటుగా విడుదల చేయండి అంటూ భారత్ ఆగష్టు 15 ముహూర్తం పెట్టేసింది..! ఇదే కదా భారత్ ఫార్మా రంగం అంటే. ఇదే కదా ఇండియన్ మెడికల్ యుగం అంటే…! అంత మంచి జరిగి వచ్చే నెల 15 నాటికి కరోనా వాక్సిన్ వచ్చేస్తే ఇక మన ఫార్మా ప్రపంచ విజేతగా నిలుస్తుంది. లేదు ఇది కూడా కొన్నిటి కంబినేషన్, ఉత్తుత్తి మందే అయితే మళ్ళీ చేతులు కట్టుకుని ఇంకొన్నాళ్ళు కరోనా ముందు సాకిలపడాలి.
ఫార్మాలో మనమెక్కడ…!
ప్రస్తుతం ప్రపంచ ఫార్మా రంగంలో భరత్ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. 2014 నుండి చూసుకుంటే 45 శాతం పెరుగుదల ఉంది. ముఖ్యంగా వాక్సిన్లు, బల్క్ డ్రగ్స్ (పేరా సెటిమాల్, మెట్ ఫార్మిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి కీలక మందులను), సెర్జికల్స్, ఆయుష్ మందులు, హెర్బల్, జనరిక్ మందులను ఎగుమతి చేస్తుంది. ఏటా రూ. 33 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, జర్మనీ, బ్రెజిల్ దేశాలకు ఎక్కువగా సరఫరా చేస్తుంది. కేవలం అమెరికాకు ఏటా రూ. 19 బిలియన్ డాలర్ల విలువైన మందులు పంపిస్తుంది. అలాగే పేరాసిటిమాల్, మెట్ ఫార్మిన్, అంఫిక్సిసిమ్ వంటి మందుల తయారీలో ఉపయోగించే ఉప ఉత్పత్తులను చైనా నుండి దిగుమతి చేసుకుంటుంది. మరికొన్నిటిని అమెరికా నుండి తెప్పిస్తుంది. ఇలా ప్రపంచంలోని పది ముఖ్య దేశాలు కూడా కీలక మందులకు మనపై ఆధార పడుతున్నారు.
ఆ దేశాల చూపులన్నీ మనపైనే…!
ఇక కరోనా వచ్చిన తర్వాత కూడా వాక్సిన్ తయారీకి అనేక దేశాలు ప్రయత్నాలు ఆరంభించిన వాటి చూపులు మాత్రం ఇండియాపైనే ఉన్నాయి. గడిచిన దశాబ్దకాలంలో ఇండియాలో ఫార్మా రంగం బాగా వృద్ధిలోకి వెళ్ళింది. ఒకప్పుడు అమెరికా, జర్మనీ టాప్ లో ఉండగా, ఇప్పుడు మనం వారికి పోటీ వెళ్తున్నాం. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా వాక్సిన్ తయారీకి ఇండియానే కీలకం అంటూ పలుమార్లు చెప్పింది. అమెరికా, రష్యా, జపాన్ సహా అనేక దేశాలు ఇండియాలోనే కరోనా వాక్సిన్ తయారవుతుందని విశ్వసిస్తున్నాం అంటూ ప్రకటనలు చేసారు. ఒకవేళ ఆగష్టు 15 నుండి కరోనా వాక్సిన్ మార్కెట్ లోకి వస్తే మాత్రం ప్రపంచం నుండు మళ్ళీ ఒత్తిళ్లు మొదలవుతాయి. దాదాపు 100 కోట్ల మందికి సరిపడా వాక్సిన్లు ఒకేసారి విడుదల చేస్తే పర్లేదు, లేదా చాలీ చాలక ఒత్తిళ్లు మొదలవుతాయి. ఇదే ఫార్ములాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలోనూ కొన్ని తయారు కావచ్చు.