బట్టతలతో బాధపడుతున్నారా? ఇవే పరిష్కార మార్గాలు ఇవే!

ప్రస్తుత కాలంలో చాలా మంది బట్టతల సమస్యతో బాధపడుతుంటారు. అంతేకాకుండా వయసుతో తారతమ్యం లేకుండా చాలా మందిలో ఎక్కువగా జుట్టు రాలిపోవడం వల్ల బట్టతల వస్తుందేమోననే ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. సాధారణంగా ఆడవారిలోనూ, మగవారిలోనూ జుట్టురాలిపోవడం సర్వసాధారణమే. మగవారిలో ఎక్కువగా జుట్టు రాలిపోతే బట్టతల ఏర్పడుతుంది. అదే మహిళల్లో అయితే జుట్టు రాలిపోతూ జుట్టు పల్చబడటం జరుగుతుంది. ఈ విధంగా జుట్టు రాలిపోతూ బట్టతల ఏర్పడే వారికి తిరిగి హెయిర్ గ్రోత్ రావడానికి కొన్ని పరిష్కార మార్గాలను తెలియజేశారు. ఆ పరిష్కారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

బట్టతల అనేది ఎక్కువగా పురుషులలో వస్తుంది. ఆ విధంగా బట్టతల ఏర్పడటానికి గల కారణం మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవడం వల్ల బట్టతల ఏర్పడుతుంది అని భావించేవారు. కానీ నీ అందుకు కారణం టెస్టోస్టిరాన్ హార్మోన్ కాదని, డీ హైడ్రో టెస్టోస్టిరాన్ కారణమని తాజా పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు వెల్లడించారు. పురుషులలో ముదురు పైభాగం నుంచి క్రమంగా జుట్టు ఊడిపోతూ బట్టతల ఏర్పడుతుంది. అదే మహిళల్లో అయితే తల పైభాగం నుంచి జుట్టు రాలిపోవడం జరుగుతుంది. అయితే బట్టతలను నిర్ధారణ చేయడానికి డర్మో స్కోపి లేదా ట్రైకోస్కోపీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది.

ఈ పరీక్షల ద్వారా బట్టతల వచ్చినట్లు నిర్ధారణ అయితే ముందుగా మినాక్సిడిల్, ఫెనస్టెరైడ్, డ్యూటస్టెరైడ్‌ వంటి మందులు వాడటం వల్ల కొంత వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ వీటివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోతే మీసోథెరపీ, స్టెమ్‌సెల్‌ థెరపీ, ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా అండ్‌ డర్మారోలర్‌ వంటి ప్రక్రియలను ఉపయోగించి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా హెయిర్ గ్రోత్ రావడానికి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి చికిత్సలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.