శరీరం ఫిట్ గా ఉన్న గుండెపోటు వస్తుందా.. కారణం అదే..!

మన శరీరం ఎంతో ఫిట్ నెస్ ఉండి, మన శరీరానికి కావల్సినంత వ్యాయామాలు చేస్తూ, సరైన పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూన్నప్పటికీ కూడా కొంతమంది గుండెజబ్బు బారిన పడుతుంటారు. మన శరీరం ఎంతో ఫిట్ గా ఉంది కదా అలాంటప్పుడు గుండెపోటు రాకూడదని ఎలాంటి నియమాలు లేవు. మన శరీరం ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ కొంత మందిలో గుండెపోటు వస్తుంది. అందుకు గల కారణం వంశపారంపర్యంగా వారి కుటుంబంలో గుండె జబ్బులు రావడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.

సాధారణంగా ప్రతి ఒక్కరికి 45 ఏళ్ల వయసు దాటినప్పటి నుంచి తరచు గుండెజబ్బులతో బాధపడుతుంటారు. అయితే ఈ జబ్బు నుంచి విముక్తి పొందాలని మధ్య వయస్సు ఉన్నవారు ఎక్కువగా శరీర వ్యాయామం చేస్తున్నారని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా తన పరిశోధనల్లో పేర్కొంది. చాలా మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండా శరీరంలో తగినంత సామర్థ్యం ఉన్నప్పటికీ గుండెజబ్బుల బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా అధిక కొలెస్ట్రాల్ రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారి కుటుంబంలో వంశపారంపర్యంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలను కప్పి వేయటం వల్ల గుండెకు రక్తం సరఫరా కాకుండా హార్ట్ ఎటాక్ రావడానికి దారితీస్తుంది.ఈ విధంగా కొంతమందిలో ఎటువంటి లక్షణాలు లేకుండా ఉన్నఫలంగా గుండెపోటు రావడంతో అకాల మరణం సంభవిస్తుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. అందుకోసమే 40 సంవత్సరాలు పైబడిన వారు సంవత్సరానికి ఒక్కసారైనా లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఏవైనా సమస్యలు తలెత్తితే ముందుగానే వాటికి సరేనా చికిత్స చేయించుకోవడంతో పాటు,మంచి పోషకాహారం తీసుకుంటూ శరీరానికి తగిన వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్య మరింత ముదిరి అవకాశం ఉండదు.