NewsOrbit
Featured ట్రెండింగ్ తెలంగాణ‌

ఇది అలాంటిలాంటి హోటల్ కాదు.. అప్పటి మందం హోటల్!

కొన్ని సార్లు పొగడ్తల కంటే తిట్లే చాలా మంచిగా అనిపిస్తాయి. అవే మన సక్సెస్ కు కారణం అవుతాయి కూడా.. ఇట్లాంటి విషయమే ఈ మధ్య ఒకటి వెలుగులోకి వచ్చింది. అదే అప్పటి మందం హోటల్.

అయితే ఇదేం పేరు అని ప్రశ్న రావొచ్చు. ఈ పదం తెలంగాణ వాళ్లకు చాలా సుపరిచితమే. దీనికి అర్థం తాత్కాలికం అని. అప్పటి అవసరాలను తీర్చుకునే ప్రయత్నాన్ని అప్పటి మందం అని పిలుస్తారు. అయితే ఈ పదమే ఒక వ్యక్తి జీవితానికి దారి చూపింది. ఇదే పేరు తన వ్యాపారానికి ఉపయోగ పడింది.

కరీంనగర్ జిల్లా వెంకట్రావుపల్లికి చెందిన ఉయ్యాల లచ్చయ్య గౌడ్ అనే వ్యక్తి అప్పటి మందం పేరుతో 10ఏండ్లుగా హోటల్‌ను నడుపుతూ జీవిస్తున్నాడు. అయితే ఆయన ఆ పేరు పెట్టడానికి పెద్ద కథే ఉంది.

లచ్చయ్య గౌడ్ తన కుటుంబాన్ని పోషించేందుకు ఎన్నో పనులు, మరెన్నో ప్రయత్నాలు చేశాడు.కూలీ నాలీ చేసినా, కుల వృత్తిలో భాగంగా కళ్లు గీసినా తన ఆర్థిక అవసరాలు మాత్రం తీరలేదు. ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి సౌదీ, దుబాయ్ లాంటి దేశాలకు వలస కూలీగా కూడా వెళ్లొచ్చాడు.

అయినా మార్పు రాకపోయేసరికి ఆ తర్వాత మళ్లీ కులవృత్తిలోకి వచ్చాడు. ఇలా ఒక పని మీద ధ్యాసపెట్టి చేయకపోవడాన్ని చూసిన గ్రామస్తులు లచ్చయ్యను అప్పటి మందం గాడివి అని కామెంట్ చేసేవాళ్ళు. ఇలా తనను కామెంట్ చేసే పేరుతో లచ్చయ్య హోటల్ స్టార్ట్ చేసి మంచి లాభాలు పొందుతున్నాడు. పట్టుదల ఉంటే ఎప్పటికైనా సక్సెస్ కావొచ్చని లచ్చయ్య చెబుతున్నాడు.

Related posts

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

ఏపీ బీజేపీలో పేప‌ర్ పులుల‌కు లెక్కేలేదా…!

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

సీఎం ర‌మేష్ ఇలా చేశారేంటి… బీజేపీకి ఊహించ‌ని దెబ్బ కొట్టారే…!

ఏపీలో బీజేపీ ఒక్క సీటూ గెల‌వ‌దంటూ పందాలు…!

ష‌ర్మిల Vs అవినాష్‌.. గెలుపు టైట్ అయిపోయిందే…!

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

మ్యాచ్ ఫిక్సిగ్‌: బీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఎంపీ క్యాండెట్ల‌ను కూడా డిసైడ్ చేస్తోన్న కిష‌న్‌రెడ్డి..!

పోటీ లేదు.. బొక్కాలేదు.. పార్లమెంట్ ఎన్నికలను లైట్ తీసుకోనున్న కేసీఆర్..!

ఎంపీ సీటు కోసం బీజేపీ సీఎం ర‌మేష్ డ్రామాలు చూశారా..?

BJP: బీజేపీకి ఊహించని షాక్ ..కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత

sharma somaraju