NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

డిసెంబర్- 6- కార్తీకమాసం-ఆదివారం- బహుళ షష్టి మధ్యాహ్నం 3.23 నిమిషాల వరకు అనంతరం సప్తమి. ఈరోజు గ్రహచలనాలను పరిశీలిస్తే చంద్ర సంచారం కర్కాటకంలో సంచరిస్తున్నాడు. మిగిలినవాటి స్థితిని బట్టి ఆయా రాశులకు కలిగే ఫలితాల విశేషాలు….

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు……………………………………..
మేష రాశి
ఈరోజు త్వరగా నిర్ణయాలు తీసుకోండి !
ఈరోజు మంచి చెడులు విశ్లేషించి నిర్ణయాలు తీసుకోండి. అంతేకాకుండా దృఢంగా, ధైర్యంగాను త్వరగా నిర్ణయాలు తీసుకొండి. ఈరోజు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యము చేయవద్దు.
గతంలో మీరుచేసిన పనికి సంబంధించి ఫలితాలు ఎటువంటి వైనా స్వీకరిండచానికి మానసికంగా సిద్ధంగా ఉండండి. ఉక్కిరి బిక్కిరి అయ్యే వార్తను మీ పిల్లలు అందించవచ్చు. ఈరోజు షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తి చెందవచ్చు.
రెమిడీః బలమైన ఆర్థిక పరిస్థితుల కోసం సూర్యారాధన, ఆదిత్యహృదయం పారాయణం చేయండి.
………………..
వృషభరాశి
ఈరోజు విజయం కోసం ఆలోచనలు చేయండి !
మీ చురుకైన పనితనం మిమ్మల్ని లక్ష్యం వైపునకు నడిపిస్తుంది. విజయం కోసం సానుకూల దృక్పథంతో ఆలోచించండి. ఈరోజు ఆర్థిక నష్టాలకు అవకాశం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించండి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఈరోజు జీవిత భాగస్వామి ఈ మిమిల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంది.
రెమిడీః బలమైన ఆర్థిక జీవితాన్ని పొందడానికి శ్రీలక్ష్మీ కవచం పారాయణం చేయండి.
……………………..
మిథున రాశి
ఈరోజు శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం !
ఈరోజు మీరు ధనాన్ని ఎలా దాచుకోవాలో తెలుసుకుంటారు. బంధుత్వ సంబంధ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశాలు న్నాయి. శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. విద్యార్థులు శ్రమిస్తే మంచి ఫలితం వస్తుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.
రెమిడీః శ్రీ భ్రమరాంభ అష్టకం పారాయణం చేయండి.
………………….
కర్కాటక రాశి
మీ వస్తువులు జాగ్రత్త !
మీకు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మీ కెరీర్‌ పెరుగుదల కోసం వినియోగించండి. ప్రయాణం చేస్తున్నప్పుడు వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము. అశ్రద్దగాఉంటే మీవస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. కుటంబంలో సామరస్యంగా మెలుగండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్‌ చేస్తారు. దీనిలో అనవసర ఖర్చులు చేసే అవకాశం.
రెమిడీః ఆర్ధిక స్థితి కోసం మీ కులదైవాన్ని ఆరాధించండి.
……………..

సింహరాశి
ఈరోజు సంతోషంగా ఉంటారు !
ఈరోజు మీతల్లిగారి తరుఫు వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో సంతోషంగా ఉంటారు. మీరు అనుకోకుండా విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు మిశ్రమంగా ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
రెమిడీః అనుకూల ఫలితాల కోసం మంచి గంధాన్ని దేవుడికి సమర్పించి మీరు పెట్టుకోండి.
………………..
కన్యా రాశి
ఈరోజు ధనాన్ని అనసరంగా ఖర్చు చేయకండి !
ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు సోషల్‌ వెబినార్‌లకు హజరవుతారు. దీనితో మీ మూడ్ని మార్చుకొండి. మీరు ధనాన్ని సంపాదించినా కానీ అది జారిపోకుండా జాగ్రత్త పడండి. అంటే అనవసర ఖర్చులు పెట్టకండి. కుటుంబంతో సంతోషంగా ఉండే సమయం. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం. మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు.
రెమిడీః ఆరోగ్యకరమైన జీవితం కోసం సప్తముఖి రుద్రాక్ష ధరించండి.
………………….

తులా రాశి
ఈరోజు మీకు మంచి సమయం !
ఈరోజు అనకూల ఫలితాలు వస్తాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు సంపాదించే ధనాన్ని పేదలకు, దేవాలయాలకు కొంత దానధర్మం చేస్తారు. దీనివల్ల మానసిక శాంతిని పొందుతారు మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.

రెమిడీః కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
……………………

వృశ్చికరాశి
ఈరోజు ఓర్పుతో ఉండాల్సిన సమయం !
ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల అనారోగ్యం మిమిల్ని వత్తిడికి గురిచేస్తుంది. అనుకూలమైన ఫలితాల కోసం మీరు ఓర్పుతో మెలగాల్సిన రోజు. విద్యార్థులు ఆటల కోసం సమయాన్ని కేటాయించవద్దు. అనవసర ఖర్చులు నియంత్రించుకోండి. వైవాహికంగా సాధారణమైన రోజు ఇది.
రెమిడీః పేదలకు, బ్రాహ్మణులకు దానధర్మాలు చేయండి.
………………….
ధనుస్సు రాశి
ఈరోజు పాజిటివ్‌గా ఆలోచించండి !
ఈరోజు అనుకూల వాతావరణం. ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు క్రొత్త పెట్టుబడుల అవకాశాలను జాగ్రత్తగా గమనించండి.కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వచ్చే అవకాశం కానీ మీరు ఆవేశపడకండి. ఇంటికి అనుకొని అతిథి వస్తారు. వైవాహికంగా సంతోషం, ఆనందం ఈరోజు అనుభవిస్తారు.
రెమిడీః మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి నువ్వులనూనెతో శివుడి దగ్గర దీపారాధన చేయండి.
…………….
మకరరాశి
ఈరోజు మీ ధనం జాగ్రత్త !
ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు డబ్బును జాగ్రత్తగా పెట్టుకోండి. లేకుంటే దొంగలించబడే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమిస్తే తప్పక విజయం వస్తుంది. గ్రహనక్షత్ర రీత్యా మంచి ఆహారం మీకు లభించే అవకాశం. మీ ఎదుగుదలకు జీవిత భాగస్వామే ముఖ్యకారణము అని గ్రహిస్తారు.
రెమిడీః మంచి ఆరోగ్య ప్రయోజనాల కోసం ‘ఓం గిరి సూర్యాయనమః’’ అనే మంత్రాన్ని పారాయణం చేయండి.
………………..
కుంభ రాశి
ఈరోజు పాత మిత్రలను కలిసే అవకాశం !
ఈరోజు అనుకూల, ప్రతకూల ఫలితాల మిశ్రమం. భయం వీడి పనిని పట్టుదలతో చేయండి. కుటుంబ సభ్యుల వాదనను మీరు వినండి. వారికి సమయం కేటాయించి శ్రద్ధను కనపర్చడం చేయండి. ఈరోజు సమయాన్ని మంచిగా సద్విని యోగం చేసుకోండి. పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
రెమిడీః గోసేవ చేయండి. మంచి ఫలితాన్ని పొందండి.
…………………………….

మీనరాశి
ఈరోజు ఆర్థిక సమస్యలు పోతాయి !
ఈరోజు మీరు అనుకోని మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. దీనివలన మీ సమస్యలు తొలగిపోతాయి. పెండింగ్‌ పనలు పూర్తిచేయడానికి అనుకూలమైన రోజు. ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు పరీక్షల భయం వీడండి. శ్రమించండి విజయం మీ సొంతం అయ్యే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి నుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ అందుకునే అవకాశం గ్రహచలనరీత్యా కన్పిస్తుంది.
రెమిడీః మంచి ఆరోగ్యాన్ని పొందడానికి శ్రీలక్ష్మీ అష్టకం పారాయణం చేయండి.

author avatar
Sree matha

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!