45 రోజుల్లో ఎడారిగా మారనున్న ఆ దేశం?

మనకు ప్రకృతి నుంచి లభించే వనరులలో నీరు ఒకటని చెప్పవచ్చు. మన నిత్య జీవితంలో నీటికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని ఉంది. ఒక పూట ఆహారం తినకుండా కూడా మనం జీవించగలం. కానీ నీటిని తీసుకోకుండా కొన్ని గంటలపాటు కూడా ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా రోజురోజుకీ పెరుగుతున్న మానవ అవసరాలను బట్టి వేల సంఖ్యలో అడవులను నాశనం చేస్తూ పరిశ్రమలను స్థాపిస్తున్నారు. దీని ద్వారా వర్షాలు పడకుండా తీవ్ర కరువు కాటకాలు ఏర్పడి మానవ జీవితం అస్తవ్యస్తంగా మారబోతుందని చెప్పడానికి టర్కీ దేశం ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.

అవసరమైన మేరకే నీటిని వాడుకొని నీటిని వృధా కాకుండా కాపాడుకోమనీ ఎన్నోసార్లు నిపుణులు హెచ్చరిస్తున్నా లెక్కచేయకుండా నీటిని వినియోగించడం ద్వారా ప్రస్తుతం నీటి కరువును ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పర్యాటక ప్రాంతంగా ఎంతో ప్రసిద్ధి చెందిన టర్కీ దేశంలో మరి కొద్ది రోజులలో కరువు విలయతాండవం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే టర్కీ లోని వివిధ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడూ నీటితో కళకళలాడే ఇస్తాంబుల్ త్వరలోనే ఎడారిలా మారబోతుంది. రాబోయే 45 రోజులలో టర్కీ దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న జలాశయాలు డ్యాములలో నీరు ఇంకిపోయే తీవ్ర కరువు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా టర్కీ దేశంలో కరువు ఏర్పడటానికి కారణం దశాబ్దాల కాలం నుంచి సరైన వర్షపాతం లేక ప్రస్తుతం తీవ్ర నీటి కరువు ఏర్పడింది. ఇప్పటికే ఇజ్మీర్ , బ్యుర్సాలోని డ్యామ్ ల్లో 36శాతం, 24శాతం మేర నీళ్లు ఎండిపోయాయి. రానున్న మరో 110 రోజుల్లో మిగిలిన డ్యాములు జలాశయాలలో ఉన్న నీరు కూడా ఎండిపోయి కరువు విలయతాండవం చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇతర దేశాలు ఎదుర్కోకుండా ఉండటానికి హెచ్చరిక అని చెప్పవచ్చు. ఇప్పటికైనా మనుషులు మేల్కొని ప్రకృతి నుంచి లభించే నీటి వనరులను కాపాడుకోవాలని రాబోయే తరాలకు ఈ నీటి వనరులను అందించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.