NewsOrbit
Featured మీడియా

దేవినేని – అనిల్ కుమార్…! జలవనరుల్లో ఎవరు బెటర్..? (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం)

పరిపాలనలో సీఎం సగమే… మిగిలిన సగం మంత్రులు అందరూ..! అలా ఉంటేనే అన్ని ఆలోచనలు కలిసి.., పాలన రధం బాగుంటుంది…!

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 13 నెలలు గడిచింది. మంత్రివర్గం కూడా బాధ్యతలు తీసుకుని 13 నెలలు కావచ్చింది. మరి మంత్రులు ఎంతవరకు ప్రగతి సాధించారు..? వారి శాఖలను ఏ మేరకు అవపోశన పట్టారు..? అనేది ముఖ్యం. సీఎం గా చంద్రబాబు, జగన్ పాల విషయాలను పక్కన పెట్టి… ప్రస్తుతం ఈ ఏడాది కాలంలో మంత్రుల పనితీరు… గత ప్రభుత్వ మంత్రుల పనితీరు ఎలా ఉంది…? అనేది “న్యూస్ ఆర్బిట్” రోజుకో శాఖపై ప్రత్యేక కధనాలు, విశ్లేషణలు అందిస్తోంది.

రాష్ట్రంలో ప్రగతి పరవసించాలన్నా.., రైతు పులకరించాలన్నా, పైరు పైకి రావాలన్నా.., కాలువల్లో నీరు ప్రవహించాలి. అప్పుడే పైరు నవ్వుతుంది. రైతు పంట పండుతుంది. పాలనలో సానుకూల బీజం పడుతుంది. అటువంటిదే జలవనరుల శాఖ. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో దీన్ని దేవినేని ఉమామహేశ్వరరావు ఐదేళ్ళపాటు చేశారు. మరి నాడు దేవినేని ఎలా పనిచేశారు ? ప్రస్తుతం అనిల్ కుమార్ ఎలా పని చేస్తున్నారు? అనేది సమీక్ష రూపంలో తెలుసుకుందాం.

 

గత ప్రభుత్వంలో జలవనరులశాఖకు బాగానే ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం నుండి నీటిని అందించడానికి ఆలస్యం అవుతుంది అని గ్రహించి, పట్టిసీమను తెచ్చారు. దీనిలో అవినీతి, ఆరోపణలలు పక్కన పెడితే ప్రయోజనాలు మాత్రం రైతులకు బాగానే అందాయి. వారం,వారం పోలవరం అంటూ ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టించే దిశగానూ బాబు హయాంలో పని చేశారు. అదే సందర్భంలో నీటిపారుదలకు తనకు అత్యంత ఆప్తుడైన దేవినేని ఉమాకు బాధ్యతలు అప్పగించారు. దేవినేని కూడా చురుకుగా పనిచేసారు. పోలవరం విషయంలో పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో, రాయలసీమలోని కొన్ని ప్రాజెక్టుల విషయంలో తొలి ఆరు నెలల పాటు అవగాహన పెంచుకున్న దేవినేని ఆ తర్వాత చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగా పనులు చేయించారు. ముఖ్యంగా పట్టిసీమ నిర్మాణం పూర్తి చేయడంలోనూ.., పోలవరం పనులు వేగం అందుకోవడంలోను దేవినేని పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు పట్టిసీమకు రూ. 1660 కోట్లు కేటాయించి కుడి కాలువ ద్వారా నీటిని పంపింగ్ చేసారు. ఆ క్రమంలో పట్టిసీమ ప్రాజెక్టు అనుకున్న లక్ష్యం మేరకు 2016 జూన్ నాటికే నీటిని అందించారు. ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంలో దేవినేని ఉమా కీలకం. 2015 డిసెంబర్ నుండి 2016 మర్చి మధ్యలో ఆయన స్వయంగా కాలువ గట్లపై నిద్రించి పనులు పరుగులు పెట్టించారు. ఆ సమయంలో జలవనరుల ENC వెంకటేశ్వరరావు, సిఈ రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ … ఇలా అందరూ పట్టిసీమ విషయంలో గట్టిగా కృషి చేసి, అనుకున్న మేరకు పూర్తి చేసారు. 2016 జూన్ నాటికి వర్షాలు కురిసే సమయానికి ప్రకాశం జిల్లా పర్చూరు వరకు ఆ నీరు అందాయి. దీంట్లో చంద్రబాబు పాత్రతో పటు దేవినేని పాత్ర కూడా స్పంష్టంగా కనిపిస్తుంది.

పోలవరంలోనూ చురుకే…!

పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే , ఎప్పుడో 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పనులు 2008 వరకు కొనసాగాయి. కాలువల నిర్మాణం కూడా 25 శాతం పూర్తి చేశారు . ప్రధాన ప్రాజెక్టు కట్టడం ,రిజర్వాయర్ నిర్మాణం మాత్రం అప్పట్లో రెండేళ్ల పాటు చురుగ్గా జరిగి ఆ తర్వాత నిధుల సమస్య అగిపోయాయి. తర్వాత 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పనులు ఊపందుకున్నాయి. ఇక్కడ కూడా అవినీతి, ఆరోపణలు అనే అంశాలను పక్కన పెడితే పనుల విషయంలో బాగానే జరిగాయి. ఒక ప్రధాన కంపెనీకి టెండర్లు కట్టబెట్టి దాని ద్వారా మరో మూడు కంపెనీలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చి, వాటి ద్వారా పనులు చకచకా చేయించారు. రాజశేఖర్ రెడ్డి టైములో రెండేళ్ల పాటు.., చంద్రబాబు హయాంలో 2016 నుంచి 2019 మధ్య మూడేళ్లపాటు అదే వేగంతో జరిగాయి. మొత్తానికి వారం వారం పోలవరం అనే చంద్రబాబు ఆ దిశగానే తీవ్రంగా ప్రయత్నాలు చేసి 70 శాతం వరకు ప్రధాన ప్రాజెక్టులు కట్టడం పూర్తి చేయగలిగారు. దీనిలోనూ దేవినేని స్పష్టంగానే పని చేసారు. అయిదేళ్లలో జలవనరుల శాఖ మంచి పనితీరు కనబరిచింది ఫలితాలను చూపించింది. అవినీతి ఆరోపణలు, సబ్ కాంట్రాక్టులు పొందడం.., నోట్లు చేతులు మారడం అనే విషయాలను పక్కనపెడితే ఫలితాలు మాత్రం కొంత మేరకు చూపించారు.

అనిల్ వెనుకబడినట్టే…!

అనిల్ కుమార్ విషయానికి వస్తే గడిచిన ఏడాదిలో తన శాఖపై కొత్త సాధించుకోవడంలో విఫలమయ్యారు. అనిల్ కుమార్ అంటే ఇప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆ పార్టీలో బలంగా మాట్లాడే ఎమ్మెల్యేగానే తెలుసు తప్ప… ఆయన నీటివనరుల మంత్రి.., ఆయన ప్రాజెక్టులపై మాట్లాడతారు అనే విషయం ఎవ్వరికీ తెలీదు. ఆయన ఒక జలవనరుల శాఖ మంత్రి అని, ప్రాజెక్టు ఆయన సమీక్షిస్తూ ఉంటారని, ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఆయనే పరుగులు పెట్టిస్తారని.., తెలియదు. ఎందుకంటే ఆయన కూడా ఏనాడు అలా చేయలేదు. మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ శతశాతం విఫలం అయ్యారని చెప్పుకోవాలి. జగన్ కి కంకణబద్ధుడిగా, వైసిపి వీర నాయకుడిగా అనిల్ శతశాతం మార్కులు పొందవచ్చు.., కానీ మంత్రిగా మాత్రం బాగా వెనుకబడి ఉన్నారు. కనీసం సగం రాజకీయాలు మాట్లాడి, సగం తన సఖ గురించి మాట్లాడినా కొంత నయంగా ఉందది. కానీ “చంద్రబాబుకి బులెట్ దింపుతూ, లోకేష్ ని బదనాం చేస్తూ…, టీడీపీని విమర్శిస్తూ మంత్రిగా కొనసాగడం కంటే… పార్టీలో ఎమ్మెల్యేగా, పార్టీ పదవిలో ఉంటూ ఎన్ని విమర్శలు అయినా చేసుకోవచ్చు. ప్రత్యర్థిని టార్గెట్ చేయడానికి, పార్టీలో నాయకులు ఉన్నారు. మంత్రి హోదా అవసరం లేదు.

ముద్ర వేసి మాజీగా వెళ్ళండి…!

“సీఎం జగన్ ఈ విషయంలో ఉదాహరణ. ఆయన సీఎం గా బాధ్యతహలు చేపట్టిన తర్వాత నేరుగా ఎవ్వరినీ విమర్శలు చేయలేదు. పరోక్షంగానే అప్పుడప్పుడూ డైలాగులు వేస్తుంటారు.” నిత్యం సంక్షేమం, ప్రగతిపైనే మాట్లాడుతుంటారు. అలాగే మంత్రి అనిల్ కూడా కొంత మేరకు తన శాఖని పట్టించుకుంటే మంచిది. మాజీ మంత్రిగా తన మార్కు ఉంటుంది. లేకపోతే ఆయన మాజీ అయిన తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఈ ఏడాదిలో “నీటి ప్రాజెక్టులపై అక్షరం ముక్క కూడా నేర్చుకుంది లేదు, మరో రెండు ఏడాదిన్నర తర్వాత అనిల్ కు పదవి ఉంటుందో లేదో తెలియదు. ప్రాజెక్టులపై తన ముద్ర వేసుకోవాలి. అంటే అనిల్ కుమార్ రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా.., రాజకీయ నాయకుడుగానే కాకుండా…, సబ్జెక్టు కలిసిన ప్రాజెక్టు గురించి మంచిగా మిగిలిపోవాలి. అందుకే దేవినేని తో పోలిస్తే అనిల్ కుమార్ పది అడుగుల ఇంకా వెనకనే ఉన్నారు. దేవినేని గురించి చెప్పుకోవాలంటే నేటికి పట్టిసీమ ప్రాజెక్టు అని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి ప్రాజెక్ట్ వర్క్ ఉంటే ఈ ఏడాది పూర్తి చేసి చూపిస్తే కొంతవరకు విజయవంతమైన మంత్రిగా మాజీ అవుతారు.

author avatar
Srinivas Manem

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

Bigg Boss 7: రతిక రోజ్ గుండెలో ఇంత భారాన్ని మోస్తుందా? ఆ కారణం వల్లే రాహుల్‌తో బ్రేకప్ అయ్యిందా? నిజాలు బయటపెట్టిన పెద్దయ్య!

Raamanjaneya

MS Dhoni: డోనాల్డ్ ట్రంప్ తో ధోని గోల్ఫ్…

Deepak Rajula

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

ABN Andhra Jyothi: ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థను కేసిఆర్ సర్కార్ వెలి వేసినట్లేనా..!

sharma somaraju

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Karthika Deepam: ప్రేమ పేరుతో మళ్ళీ జ్వాలకు అన్యాయం చేసిన హిమ.. బాధలో జ్వల..ప్రేమ మైకంలో హిమ., నిరూపమ్ లు..!!

Deepak Rajula

Karthika Deepam: ముక్కలయిన ప్రేమ్ మనసు… నిరూపమ్, హిమల పెళ్లి విషయంలో తగ్గేదేలే అంటున్న తల్లి కూతుళ్లు..!!

Deepak Rajula