NewsOrbit
FIFA World Cup 2022

Lionel Messi: మెస్సి నిర్ణయంతో నిరుత్సాహం చెందుతున్న అభిమానులు..!!

Lionel Messi: ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ తన లాస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ అని ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇప్పటివరకు సాధించిన విజయాలతో చాలా సంతోషంగా ఉన్నాను. మరో ప్రపంచ కప్ ఆడాలంటే చాలాకాలం ఎదురు చూడాలి. సో అప్పటి వరకు నేను ఆడగలుగుతాను అని నేను అనుకోవడం లేదు. ఈ ఫైనల్ తోనే నా ప్రపంచకప్ ప్రయాణం ముగించాలని భావిస్తున్నాను అని తెలియజేయడం జరిగింది.

Fans are disappointed with Messi's decision
FIFA WC 2022

లియోనెల్ మెస్సి ప్రకటనతో అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. ఈ ప్రకటనపై పునరాలోచించాలని కోరుతున్నారు. మంగళవారం ఫిఫా ప్రపంచకప్ మొదటి సెమీఫైనల్ లో క్రోయోషియాతో… అర్జెంటీనా జట్టు తలపడటం జరిగింది. ఈ మ్యాచ్ లో 3-0 తేడాతో విజయం సాధించటంతో ఫైనల్ కి అర్జెంటీనా చేరడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచే అర్జెంటీనా తరపున తాను ఆడబోయే చివరి మ్యాచ్ అని స్పష్టం చేయడం జరిగింది. సెమీఫైనల్ మ్యాచ్ మొదటి అర్థం భాగంలో మెస్సి మొదటి గోల్ వేయడం జరిగింది. ఈగోల్ తో ఈ ప్రపంచ కప్ లో ఐదు గోల్స్ వేసుకోవడం జరిగింది. ఇదే సమయంలో వరల్డ్ కప్ లలో అత్యధికంగా 11 గోల్స్ అర్జెంటీనా జట్టు తరపున వేసిన ప్లేయర్ గా లియోనెల్ మెస్సి రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో కెప్టెన్ గా అర్జెంటీనాకి ఎలాగైనా ప్రపంచకప్ అందించే దిశగా మెస్సి ఆలోచనలు చేస్తున్నాడు.

Fans are disappointed with Messi's decision
FIFA WC 2022

అర్జెంటీనా ప్రపంచకప్ గెలిచి దాదాపు.. 36 సంవత్సరాలయింది. 1978, 1986 తర్వాత అర్జెంటీనా మరొక ప్రపంచ కప్ గెలవలేదు. ఈ క్రమంలో ఖతర్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో లియోనెల్ మెస్సి.. టైటిల్ గెలిస్తే మాత్రం అర్జెంటీనా దిగ్గజం మారడోనా తర్వాత కప్ అందించిన కెప్టెన్ గా లియోనెల్ మెస్సి చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. ఫుట్ బాల్ టోర్నీలో అనేక మైలురాళ్లు అందుకున్న మెస్సి ఎలాగైనా.. ఈ ఫైనల్ మ్యాచ్ గెలవాలని అర్జెంటీనాకు కప్ అందించాలని.. తన కల నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ ప్రపంచ కప్ టోర్నీలో పోర్చుగీస్ ఓటమి చెందడంతో మరో ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ రోనాల్డో కూడా.. తన చివరి ప్రపంచకప్ టోర్నీ ఆడినట్లు అయింది. ఈ ప్రపంచకప్ టోర్నీలో తన టీం ఓటమి చెందటంతో … రోనాల్డో కన్నీరు పెట్టుకున్నాడు. ఈ ప్రపంచ కప్ స్టార్ ఆటగాళ్లు లియోనెల్ మెస్సి, రోనాల్డో లకి చివరిది కావటంతో ఫుట్ బాల్ లవర్స్ సైతం బాధపడుతున్నారు.

Related posts

FIFA World Cup 2022: గర్జించిన మెస్సీ… ప్రపంచ విజేతగా అర్జెంటీనా..!!

sekhar

Fifa World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ లో జర్మనీ ప్లేయర్ లోథర్ మాథ్యూస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన లియోనెల్ మెస్సీ..!!

sekhar

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ లోకి అర్జెంటీనా… రికార్డు క్రియేట్ చేసిన మెస్సీ..!!

sekhar

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో పోర్చుగల్‌ ఓటమి.. ఏడ్చిన రోనాల్డో.. యువరాజ్ సింగ్ సంచలన కామెంట్..!!

sekhar

Fact Check: సౌదీ అరేబియా ఫుట్బాల్ ఆటగాళ్ల కోసం రోల్స్ రాయిస్..

bharani jella

FIFA World Cup 2022: ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీలో.. అత్యధిక కప్ లు, అత్యధిక గోల్స్ వేసిన వారి లిస్ట్..!!

sekhar

Jio Cinema: అంబానీ గారూ…ఇది మన దేశ టెక్నాలజీకి అవమానం అయ్యా!

Deepak Rajula