33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
FIFA World Cup 2022 న్యూస్

Jio Cinema: అంబానీ గారూ…ఇది మన దేశ టెక్నాలజీకి అవమానం అయ్యా!

Jio Cinema FIFA World Cup 2022
Share

Jio Cinema: IPL లైవ్ స్ట్రీమింగ్ తరువాత అంతటి ప్రాచుర్యం జనాదరణ పొందిన టోర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది FIFA ప్రపంచ కప్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి FIFA ప్రపంచ కప్ మ్యాచులు ఇండియా లొ ఫ్రీ గా చోడోచ్చు అంటే అందరం ఆనందపడ్డాము, కానీ FIFA ప్రపంచ కప్ మ్యాచులు ప్రసారం విషయంలో జియో సినిమా(Jio Cinema:) వైఫల్యం అంతా ఇంతా కాదు, మన దేశ టెక్నాలజీకి నిదర్శనంగా నిలుస్తూ FIFA ప్రపంచ కప్ ఫాన్స్ చేత ఛీ అనిపించుకునే పరిస్థిథి.

నవంబర్ 20న మొదలైన FIFA ప్రపంచ కప్ మొదట ఖతార్ vs ఈక్వెడార్ మ్యాచ్ తో శుభారంభం అయింది. ఈ మ్యాచ్ లో ఖతార్ పై ఈక్వెడార్ 0-2 స్కోర్ ఆధిక్యంతో గెలిచింది. ఈ మ్యాచ్ ని జియో సినిమా యాప్ లో చూద్దాము అనుకున్న ఫాన్స్ కి ఫుట్బాల్ ఆట మీదనే చిరాకు వొచ్చినంత పనైంది.

రిలయన్స్ సంస్థ అధినేత అంబానీ ఫ్రీ సరుకు ఎరగా వేసి కొత్త కస్టమర్స్ తెచ్చుకోవటంలో దిట్ట. అందులో తప్పు ఏమి లేదు కానీ ఫ్రీ గా ఇస్తానని చెక్కరలో ఉప్పు కలిపి ఇస్తే తిట్టుకోకుండా ఉంటామ చెప్పండి. FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022 లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ OTT తెచ్చుకున్న జియో సినిమా మ్యాచులను నిరంతరాయంగా స్ట్రీమ్ చేయడంలో పూర్తిగా విఫలమైంది. Network 18 గ్రూప్ కి చెందిన జియో సినిమా రిలయన్స్ సంస్థకు సంబందించిన డిజిటల్ ఇంకా OTT వేదిక. FIFA ప్రపంచ కప్ స్ట్రీమింగ్ వైఫల్యానికి పూర్తి బాధ్యత వహించాల్సింది రిలయన్స్ సంస్థ అధినేత అంబానీ ఇంకా జియో సినిమా వయాకామ్ 18 ముఖ్య కార్యనిర్వాహక అధికారి జ్యోతి ఎస్. దెష్పాండె

Jio Cinema : అసలు ఏమైంది…

FIFA ప్రపంచ కప్ లో భాగంగా నవంబర్ 20న జరిగిన ఖతార్ vs ఈక్వెడార్ మ్యాచ్ జియో సినిమా యాప్ లో చూడలేక జనాలు విసిగిపోయారు. ప్రతి నిమిషం స్క్రీన్ ఫ్రీజ్ అవ్వడం, మ్యాచ్ ఎంతకూ లోడ్ అవ్వకపోవడం, బఫరింగ్ బఫరింగ్ అని జియో సినిమా యాప్ ఫాన్స్ కు పిచ్చి లేపింది. ఒకసారి బొమ్మ సరిగ్గా వొస్తే అప్పుడు ఆడియో ఆగిపోవటం. ఇంత ప్రతిష్టాత్మక FIFA ప్రపంచ కప్ ఇంత అధ్వానంగా చూడాలా? ఛీ వొద్దు బాబోయ్ అని చాలా మంది డబ్బులు పెట్టైనా సరే వేరే చోటనే చూడాలి అని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియాలో మాత్రం జియో సినిమా యాప్ కి సంబంధించిన టీమ్ ని పిచ్చ తిట్టుడు తిడుతున్నారు.

జియో సినిమా యాప్ పై ఆగ్రహంతో ఊగిపోతున్న FIFA ప్రపంచ కప్ అభిమాని ట్విట్టర్ లో వైరల్ అవుతున్న వీడియో మీరే చూడండి

Topics covered in this article: Jio Cinema App Issues, FIFA World Cup 2022, FIFA World Cup Jio Cinema Issues, Jio Cinema Streaming Issues, Football Matches Live Streaming, FIFA Live Streaming Issues.

About Author: Check author profile here- Deepak Rajula

ఈ ఆర్టికల్ పై మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉన్న లేదా మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కామెంట్స్ ధ్వారా వ్యక్త పరచండి లేదా [email protected] కు మెయిల్ రాయండ. 

 


Share

Related posts

YS Jagan : ఇలాంటివి జ‌గ‌న్ తో మాత్ర‌మే సాధ్య‌మ‌వుతాయి

sridhar

Diabetes: మధుమేహం ఉన్నవారికి కంటి చూపు తగ్గుందా..!?

bharani jella

Ys Jagan: ఆ విషయంలో దేశంలోనే టాప్ 2లో నిలిచిన జగన్ ప్రభుత్వం..!!

sekhar