NewsOrbit
FIFA World Cup 2022

Fifa World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ లో జర్మనీ ప్లేయర్ లోథర్ మాథ్యూస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన లియోనెల్ మెస్సీ..!!

Fifa World Cup 2022: ఖతార్ దేశంలో దోహా నగరంలో అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ టీమ్స్ మధ్య జరుగుతున్న  వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. అర్జెంటీనా టీం చాలా దూకుడుగా ఆడుతూ మొదటి 36 నిమిషాల్లోనే రెండు గోల్స్ సాధించి ముందంజ వేయడం జరిగింది. మ్యాచ్ ప్రారంభమైన 27వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్ నీ అర్జెంటీనా స్టార్ ఆటగాడు కెప్టెన్ లియోనెల్ మెస్సీ గోల్ గా మలచడంతో అర్జెంటీనా 1-0తో అధిక్యంలో వెళ్ళింది. పెనాల్టీ కిక్ లో ఎటువంటి పొరపాటు చేయకుండా మెస్సీ గోల్ పోస్ట్ లోకి బాల్ కొట్టడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అర్జెంటీనా టీం అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

Lionel Messi created a world record in FIFA World Cup 2022
FIFA World Cup 2022

ఇదిలా ఉంటే ఈ గోల్ తో మెస్సి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడిన ఆటగాడుగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. లియోనెల్ మెస్సీకి ప్రస్తుతం ఆడుతున్న ఈ మ్యాచ్ 26వది కావటంతో…25 ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ లతో ఇప్పటివరకు జర్మనీ ప్లేయర్ లోథర్ మాథ్యూస్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేయడం జరిగింది. కాగా అర్జెంటీనా టీములో ఫైనల్ మ్యాచ్ లో 36వ నిమిషంలో డి మారియా కొట్టిన ఫీల్డ్ గోల్ తో అర్జెంటీనా అధిక్యం 2-0కి పెరిగింది. ఈ క్రమంలో ఫ్రెంచ్ ఆటగాళ్లు… ఎలాగైనా అర్జెంటీనా దూకుడునీ కళ్ళం వేయటానికి సర్వశక్తులు ఒడ్డుతూ పోరాడుతున్నారు.

Lionel Messi created a world record in FIFA World Cup 2022
FIFA World Cup 2022

కానీ అర్జెంటీనా టీం మాత్రం మొదటి నుండి దూకుడుగా ఫుల్ ఎటకింగ్ మోడ్ తో ఎక్కడా కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా… ఫ్రెంచ్ ఆటగాలకు చుక్కలు చూపిస్తున్నారు. సరిగ్గా ఈ మ్యాచ్ కి  ముందు ఫ్రాన్స్ శిబిరంలో ఒక మిస్టరీ వ్యాధి కళకళము రేపింది. దీంతో ఫ్రెండ్స్ జట్టులో సుమారు ఐదుగురు ఆటగాళ్లు అనారోగ్యం పాలైనట్లు సమాచారం. మొరాకతో జరిగిన సెమీఫైనల్స్ ముందే ఫ్రాన్స్ కొంతమంది కీలక ఆటగాళ్లు… అనేక అనారోగ్యాలతో జట్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలో అర్జెంటీనా టీం ఫైనల్ మ్యాచ్ లో దూసుకుపోతూ ఉంది.

Related posts

FIFA World Cup 2022: గర్జించిన మెస్సీ… ప్రపంచ విజేతగా అర్జెంటీనా..!!

sekhar

Lionel Messi: మెస్సి నిర్ణయంతో నిరుత్సాహం చెందుతున్న అభిమానులు..!!

sekhar

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ లోకి అర్జెంటీనా… రికార్డు క్రియేట్ చేసిన మెస్సీ..!!

sekhar

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో పోర్చుగల్‌ ఓటమి.. ఏడ్చిన రోనాల్డో.. యువరాజ్ సింగ్ సంచలన కామెంట్..!!

sekhar

Fact Check: సౌదీ అరేబియా ఫుట్బాల్ ఆటగాళ్ల కోసం రోల్స్ రాయిస్..

bharani jella

FIFA World Cup 2022: ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీలో.. అత్యధిక కప్ లు, అత్యధిక గోల్స్ వేసిన వారి లిస్ట్..!!

sekhar

Jio Cinema: అంబానీ గారూ…ఇది మన దేశ టెక్నాలజీకి అవమానం అయ్యా!

Deepak Rajula