NewsOrbit
FIFA World Cup 2022

FIFA World Cup 2022: గర్జించిన మెస్సీ… ప్రపంచ విజేతగా అర్జెంటీనా..!!

FIFA World Cup 2022: ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఆరంభంలోనే…అర్జెంటీనా రెండు గోల్స్ వేయడం జరిగింది. దీంతో మొదటి నుండి చాలా దూకుడుగా… అర్జెంటీనా టీం ఆడింది. తొలి అర్ధ భాగంలో ఫ్రాన్స్ ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. దీంతో మ్యాచ్ దాదాపు అర్జెంటీనా చేతికి వెళ్లిపోయింది అని అనుకున్న సమయంలో…ఫ్రాన్స్ ప్లేయర్ ఎంబాపె..ఫైనల్ ముఖ చిత్రం మొత్తం మార్చేశాడు. బ్యాక్ టు బ్యాక్ 97 సెకండ్ ల వ్యవధిలో రెండు గోల్స్ వేసి ఊహించని షాక్ ఇచ్చాడు. దీంతో రెండు టీమ్స్ నరాలు తెగే ఉత్కంఠ భరితంగా ఆటకొనసాగించాయి.

Roaring Messi... Argentina as world champion
Fifa World Cup 2022

ఈ క్రమంలో అర్జెంటీనా… ఆటగాళ్లు కొద్దిగా నిస్సాయంగా కనిపించారు. డిఫెన్స్ తో తమగోల్ పోస్ట్ కాపాడుకోవడం కూడా కష్టతరం ఉన్నట్టు పరిస్థితి మారింది. ఇలాగా మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసింది. ఆ తర్వాత ఎక్సాట్రా టైం ఇచ్చిన స్కోర్ లు సమంగానే ఉండటంతో… పెనాల్టీ షూట్ అవుట్ పెట్టడం జరిగింది. ఇందులో ఫ్రాన్స్ రెండు పాయింట్స్.. సాధించగా అర్జెంటీనా టీం నాలుగు పాయింట్లు సాధించటంతో…ఫిఫా వరల్డ్ కప్ అర్జెంటీనా కైవసం చేసుకోవడం జరిగింది. లియోనెల్ మెస్సీకి ఇది చివరి ప్రపంచ కప్ కావడంతో… అర్జెంటీనా జట్టు గెలవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ అభిమానులు కోరుకున్నారు.

Roaring Messi... Argentina as world champion
Fifa World Cup 2022

మెస్సి కూడా అనేక తన డ్రీమ్ ఎలాగైనా నెరవేర్చుకోవాలని.. ఫైనల్ మ్యాచ్లో బాగా కష్టపడి.. మొదటి అర్ధ భాగంలో, ఆ తర్వాత.. పెనాల్టీ షూట్ అవుట్ లో రెండు గోల్స్ వేసి.. కెప్టెన్ గా అర్జెంటీనానీ ఛాంపియన్ గా నిలిపాడు. అంతకుముందు 1978, 1986 లో అర్జెంటీనా దిగ్గజం మారడోనా ప్రపంచ కప్ గెలవడం జరిగింది. ఆ తర్వాత 2014లో అర్జెంటీనా ఫైనల్ కి చేరిన గాని జర్మనీ చేతిలో ఓడిపోయింది. ఈ క్రమంలో 36 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్ గెలవడంతో…అర్జెంటీనా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Related posts

Fifa World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ లో జర్మనీ ప్లేయర్ లోథర్ మాథ్యూస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన లియోనెల్ మెస్సీ..!!

sekhar

Lionel Messi: మెస్సి నిర్ణయంతో నిరుత్సాహం చెందుతున్న అభిమానులు..!!

sekhar

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ లోకి అర్జెంటీనా… రికార్డు క్రియేట్ చేసిన మెస్సీ..!!

sekhar

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో పోర్చుగల్‌ ఓటమి.. ఏడ్చిన రోనాల్డో.. యువరాజ్ సింగ్ సంచలన కామెంట్..!!

sekhar

Fact Check: సౌదీ అరేబియా ఫుట్బాల్ ఆటగాళ్ల కోసం రోల్స్ రాయిస్..

bharani jella

FIFA World Cup 2022: ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీలో.. అత్యధిక కప్ లు, అత్యధిక గోల్స్ వేసిన వారి లిస్ట్..!!

sekhar

Jio Cinema: అంబానీ గారూ…ఇది మన దేశ టెక్నాలజీకి అవమానం అయ్యా!

Deepak Rajula