FIFA World Cup 2022: ఖతార్ వేదికగా ఫిఫా ప్రపంచకప్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో అంచనాలు లేని చాలా చిన్న టీమ్స్ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. టోర్నీ ప్రారంభంలో అర్జెంటీనా జట్టునీ సౌదీ అరేబియా టీం ఓడించటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదిలా ఉంటే మొరాకో టీం పోర్చుగల్ నీ ఓడించి ప్రపంచ కప్ .. గెలుచుకోకుండా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఫుట్ బాల్ ప్రపంచ స్టార్ ఆటగాడు రోనాల్డోకి ఇది చివరి ప్రపంచ కప్.

దీంతో తన జట్టు ఓటమి చెందడంతో.. ఇదే తనకి చివరి ప్రపంచ కప్ కావటంతో మ్యాచ్ ఓటమి చెందిన తర్వాత.. రోనాల్డో కన్నీటి పర్యంతం చెందాడు. మొరాకో టీం నుండి యూసఫ్ 42వ నిమిషంలో..గోల్ కొట్టడం జరిగింది. దీంతో 1-0 స్కోర్ తేడాతో పోర్చుగల్ ఓటమి చెందింది. ఈ ఓటమితో రోనాల్డో కెరియర్ దాదాపు ముగిసినట్లు అయింది. ఈ విజయంతో ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో ఆఫ్రికా నుండి మొట్టమొదటిసారి సెమిస్ చేరిన జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది.

అయితే ఓటమి తర్వాత రోనాల్డో ఏడవటంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది స్టార్ క్రీడాకారులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ స్టార్ భారత్ ఆటగాడు యువరాజ్ సింగ్… సోషల్ మీడియాలో సంచలన కామెంట్ పెట్టడం జరిగింది. ” ఇది హృదయ విషాదకరం రోనాల్డోకి. పోర్చుగల్ టోర్నీ నుండి వెళ్లిపోవడం బ్రెజిల్ టీంకు మరో.. పెద్ద దెబ్బ. కంగ్రాట్యులేషన్స్ మొరాకో… చమటోడ్చి మరి గెలిచారు అని.. యూవీ పోస్ట్ పెట్టడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న రొనాల్డో.. ఏడవటం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.