ఆ మహిళకు మరణ శిక్షణను విధించనున్న అమెరికా.. కారణం ఏంటంటే?

67 ఏండ్ల తరువాత మొదటి సరిగా అమెరికా ఒక మహిళా ఖైదీకి మరణ శిక్షను విధించనున్నట్టు సమాచారం. 2004 లో లీసామోంట్ గోమరీ అనే మహిళ గర్భిణీ స్త్రీని చంపి, ఆమె గర్భం కోసం బిడ్డను ఎత్తుకెల్లడం వంటి నేరాలకు పాల్పడింది. ఇంతటి దారుణమైన నేరానికి పాల్పడిన ఆమెకు నేరం చేసిన 16 ఏండ్ల తరువాత అమెరికా శిక్షను అమలు చేయబోతుంది. ఈ కేసులో ఆమెకు డెసెంబర్ 8 న పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వనున్నారు.

ఆమె చేసిన నేరానికి 2008 లో ఆమెకు మరణ శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. కాని అమెరికాలో 2003 తరువాత ఎటువంటి మరణ శిక్షలు విధించలేదు. అమెరికా ఫెడరల్ కోర్టు చివరి సారిగా 1953 లో బోనీ హీడీ అనే మహిళకు మరణ శిక్ష విధించింది. ఆ తరువాత ఇప్పడే అమెరికా మరణ శిక్షను అమలు చేయడం జరుగుతోంది. 1999లో ఇద్దరు మినిస్టర్స్ ను హత్య చేసిన బ్రాండెన్ బెర్నార్డ్ కు కూడా ఇదే ఏడాది డిసెంబర్ లో మరణ శిక్ష విధించనున్నట్టు తెలుస్తోంది.

మోంట్ గోమరీ, బ్రాండెన్ బెర్నర్డ్ లు మనుషులను దారుణంగా హత్యలు చేశారని అమెరికా అటర్నీ జనరల్ విలియం బార్ పేర్కొన్నారు. ఫెడరల్ కోర్టు తిరిగి మరణ శిక్షలను ప్రారంభించవచ్చని ట్రంప్ సర్కార్ పోయిన ఏడాది న్యాయ శాఖకు సూచించింది. ఇదిలా ఉంటే లీసామోంట్ గోమరీ కి మెదడు పాడయ్యిందని ఆమెకు మరణ శిక్షణను విధించవద్దని ఆమె తరఫు న్యాయవాదులు కోరుతున్నారు.