NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

కొత్త వైరస్ కాదు…. దాని రూపం మార్చుకుంది అంతే!!

 

 

యూకే లో మొదలైన కొత్త కొవిడ్ స్ట్రైయిన్ ఏమిటి?
**ఈ స్ట్రైయిన్ ని VUI 202012/01 అని పిలుస్తారు. VUI అంటే వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ అని. ఇది ఒక కొత్త వేరియంట్ మాత్రమే ఇది ఒక కొత్త వైరస్ కాదు.
వైరస్ పరిణామంలో అనేక జన్యుమార్పిడిలు జరుగుతాయి. ఈ జన్యుమార్పిడులలో కొన్ని బాగా ప్రభావవంతమైన వి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఈ మార్పు బాగా ప్రభావితమైనది అని తెలుస్తోంది. ఈ కొత్త వేరియంట్లలో సుమారుగా 17 వరకు జన్యుమార్పిడి లు ఉన్నాయని గుర్తించారు.అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది N501Y అనేది. దీనికి అర్థం ఏమిటంటే 501 పొజిషన్లో ఆస్పర్జిన్ అనే అమినోయాసిడ్ మారిపోయి టైరోసీన్ అనే అమినోయాసిడ్ ఉండటం.ఈ మ్యుటేషన్ వలన ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది సుమారుగా 70 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ మ్యుటేషన్ స్పైక్ ప్రోటీన్ లో ఉంది. స్పైక్ ప్రోటీన్ యొక్క రిసెప్టార్స్ బైండింగ్ ప్రోటీన్ లో ఉంది. దీని వలన వైరస్ మనిషి కణజాలంలోని ఏసీఈ 2 అనే రిసెప్టార్స్ కి ఎక్కువగా అంటుకునే ప్రమాదం ఉంది.


**ఈ మ్యుటేషన్ తోపాటు 69/70 ప్రాంతంలో అమినోయాసిడ్ డిలీషన్స్ కూడా కనపడ్డాయి. వీటిని డెల్టా హెచ్ 69 మరియు డెల్టా వి 70 అని పిలుస్తారు. ఈ మ్యుటేషన్స్ వలన ఈ వైరస్ immune system నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.P681H అనే మరొక మ్యుటేషన్ కూడా ఈ వైరస్ వేరియంట్లో కనబడింది.
**ఈ వేరియంట్ ని మొట్టమొదటిసారిగా యునైటెడ్ కింగ్డంలో కనుక్కున్నారు. అయితే ఇది ఇప్పుడే డెన్మార్క్లో కూడా కనబడడం విశేషం. సౌత్ ఆఫ్రికా లో మరొక వేరియంట్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికన్ వేరియంట్లో కూడా ఈ N501Y మ్యుటేషన్ ఉంది అని తెలుస్తోంది.ఈ వేరియంట్ వలన కరోనా వైరస్ తో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఎలాంటి దాఖలాలు లేవు.అదేవిధంగా ఈ వేరియంట్ వలన వ్యాక్సిన్ పనికిరాకుండా పోయే అవకాశం ఉన్నట్లుగా కూడా ఎలాంటి ఆధారం లేదు.అయితే ఈ వేరియంట్ బాగా వేగంగా వ్యాప్తి చెందడంతో యుకె కలవర పడుతోంది. ఇప్పటికే యూపీఏ లో ఆంక్షలు బాగా పెంచడం జరిగింది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా తగ్గించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విమానాలను కూడా రద్దు చేశారు. ఇప్పటికే యూకే నుంచి వచ్చే విమానాల్ని అనేక యూరోపియన్ దేశాలు రద్దు చేశాయి. ఏదేమైనప్పటికీ వైరస్ పరిణామక్రమంలో అనేక మార్పులు జరిగే అవకాశం ఉన్నందున ఈ వైరస్ ని ఎంత తొందరగా మనం నియంత్రించగలిగితే అంత మంచిది.

author avatar
Comrade CHE

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju