638 సార్లు అతన్ని చంపడానికి ప్రయత్నించారు.. కానీ చివరికి?

అత‌డు మ‌నుషుల‌ను మండుటెండ‌ల్లా మార్చే ఓ శ‌క్తి.. అత‌డు సామ్రా‌జ్య‌వాద శ‌క్తుల‌పై ధిక్కార‌పు బావుట‌ను ఎగుర‌వేసిన ఓ యోధుడు. అత‌ను విశ్వ‌వ్యాప్త విప్ల‌వ స్ఫూర్తికి ప్ర‌తీక‌గా నిలిచిన సూర్యుడు.. మూడో ప్ర‌పంచ దేశాల‌కు దిక్సూచిగా నిలిచిన మ‌హనీయుడు. ఎర్ర‌జెండా నీడ‌లో అవిశ్రాంతంగా ముందుకు సాగిన వీరుడు.. ఆయ‌నే ఫిడెల్ క్యాస్ట్రో.

ఈ పేరు వింటేనే అమెరికా సామ్రాజ్య వాదుల గుండెల్లో గుబులు పుడుతుంది. ఈ పేరు వింటే కమ్యూనిస్టుల ఒళ్లు పులకరిస్తుంది. క్యూబా లాంటి చిన్న దేశం అగ్రదేశమైన అమెరికాను వనికించింది అంటే అది కేవలం క్యాస్ట్రో సాహసంతోనే.. అలాంటి ఆయనను 638 సార్లు చంపడానికి ప్రయత్నం చేసినా ఆయన వ్రెంటుక కూడా పీకలేకపోయారని మీకు తెలుసా..?

క్యాస్ట్రో 49 ఏళ్ల‌ పాటు క్యూబాని పరిపాలించారు. అమెరికాను క్యూబా జోలికి రాకుండా గడగడలాడించాడు. దీంతో క్యాస్ట్రోని తట్టుకోలేని అమెరికా ఆయనను 600 సార్లు చంపడానికి ప్రయత్నించి విఫలమైంది. ఆయ‌న‌ను చంపాల‌ని చూసిన అధ్య‌క్షుల వివ‌రాలు.. ఐసెన్ హోవెర్ 38 ప్రయత్నాలు చేయించాడు. కెన్నడీ 42 సార్లు, జాన్సన్ 72, నిక్సల్ 184, కార్టర్ 64, రీగన్ 197, సీనియర్ బుష్ 16, క్లింటన్ 21 సార్లు (మొత్తం 638 సార్లు ) ఆయన మీద హత్యాయత్నం చేయించారు.

ఈ విష‌యాన్ని సీఐఏ రికార్డులు వెల్ల‌డించాయి. చివరి ప్రయత్నం 2000 లో పనామాలో జరిగింది. ఈ సమాచారమంతా బ్రిటిష్ డాక్యమెంటరీ ”638 Ways to Kill Castro” రికార్డు చేసింది. మొదట్లో క్యూబా అమెరికా సామ్రాజ్యవాదుల ఆధీనంలో ఉండేది. వారి నుంచి విడిపించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత క్యాస్ట్రోది. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలచిన క్యాస్ట్రో.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2016 నవంబర్ లో 90 వ యేట సహజమరణం పొందారు.