బాలీవుడ్ కమెడియన్ ఖాదర్‌ ఖాన్ మృతి

న్యూఢిల్లీ, జనవరి 1 : బాలీవుడ్ నటుడు, రచయిత ఖాదర్‌ ఖాన్(81) సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. కెనడాలోని ఓ హాస్పిట‌ల్‌లో ఖాదర్‌ఖాన్ గత మూడు నెలలుగా చికిత్సపొందుతూ కోమాలోకి వెళ్ళి తుదిశ్వాస విడిచినట్లు అతని కుమారుడు సర్ఫ్రాజ్ తెలిపారు.
ఖాదర్‌ ఖాన్ కాబూల్‌లో జన్మించారు. మంచి హాస్య నటుడిగా, రచయితగా ఆయన బాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితులు. మన్మోహన్ దేశాయ్, ప్రకాశ్ మెహరా వంటి మేటి దర్శకులతో పనిచేశారు. సుమారు 300 చిత్రాలలో ఖాదర్‌ ఖాన్ నటించారు. ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ నటులు అమితాబ్ సంతాపం వ్యక్తం చేశారు. అనేక హిట్ సినిమాల్లో ఖాన్‌తో కలసి నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.